మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టువర్టుపురం బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా రూపొందుతుంది. మరి ఈ నాగేశ్వరరావు ఎవరు..? ఆయన ఎందుకు బందిపోటు దొంగల మారాడు అనే విషయాలను తెలుసుకుందాం. నాగేశ్వరరావు పేరు వింటేనే 1970, 80వ కాలంలో పోలీసులు కూడా భయపడే వారట.
Advertisement
ఇతను ధనవంతులను దోచుకునే వాడే కానీ పేదలను… బలహీన వర్గాలకు చెందిన వారిని మాత్రం ఎలాంటి దోపిడీ చేసేవాడు కాదట. అలాగే తాను దోపిడీ ద్వారా సంపాదించిన దానిని పేదలకు కూడా ఎక్కువ శాతం ఇచ్చేవాడట. దానితో ఈయనపై అక్కడి ప్రజలకు తీవ్ర నమ్మకం ఏర్పడి ఆయనకు చాలా గౌరవం ఇచ్చేవారట.
Advertisement
అలాగే ఇతని చాలా కష్టపడి పోలీసులు పట్టుకున్నప్పటికీ ఈయన అవలీలగా అక్కడి నుండి తప్పించుకునే వాడట. జైలు గోడలు కూడా అతన్ని ఆపేవి కావని చెబుతుంటారు. ఒక సారి ఓ నేరంలో భాగంగా చెన్నైలో కట్టుదిట్టంగా ఉండే జైల్లో ఇవన్నీ పోలీసులు బంధించారట. ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన చైన్నై జైలు నుంచి అతను తప్పించుకుని పారిపోవడంతో అప్పటి నుంచి అతన్ని అందరు టైగర్ అని పిలిచేవారట. అలా నాగేశ్వరరావు కాస్తా.. టైగర్ నాగేశ్వరరావు అయ్యాడంట.
అలాగే ఈయన ఒక బ్యాంకును కూడా దోపిడీ చేసి చాలా మొత్తాన్ని దోచుకున్నాడట. ఇలా అనేక దోపిడీలు చేసి బందిపోటుగా మారిన ఈయన 1987లో పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారని అందరు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన లొంగిపోయినా… కావాలనే ఎన్కౌంటర్ చేసారని ప్రజా సంఘాలు అప్పట్లో ఆందోళనలు కూడా చేశాయి. దానితో టైగర్ నాగేశ్వరరావు ఎలా చనిపోయాడనేది ఇప్పటికీ ఓ మిస్టరీ. మరి ఇంతటి హిస్టరీ కలిగిన ఈయన జీవిత చరిత్రను టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.