Home » అందాల తార అరుణ ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుంది..!

అందాల తార అరుణ ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుంది..!

by AJAY
Ad

తెరపై మెరిసిన ఎంతో మంది తారలు ఆ తర్వాత కనుమరుగైపోయారు. అలా మొదటి సినిమాతోనే స్టార్డమ్ సాధించి హీరోయిన్ గా పరిచయమైన‌ ముచ్చెర్ల అరుణ కూడా ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సీతాకోకచిలుక సినిమా తో ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లు అందుకున్న అరుణ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. అయితే ప్రస్తుతం ఈ సీనియ‌ర్ హీరోయిన్ ఏం చేస్తుంది… ఎక్కడ ఉంది..? అనే విషయాలు తెలుసుకుందాం…. అప్పట్లో భారతీరాజా సినిమాలో హీరోయిన్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది.

ALSO READ  : బాల‌కృష్ణ సినిమాలో బాల‌న‌టిగా న‌టించి.. ఆయ‌న‌కు జోడిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Advertisement

actress aruna

actress aruna

అలాంటి అవకాశాన్ని మొదటి సినిమాతోనే అరుణ దక్కించుకుంది. సీతాకోక చిలక సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అరుణను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1981లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు… హీరోయిన్ అరుణ నటన, అమాయకత్వం ఆమె ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి.

Advertisement

ఈ సినిమా తర్వాత అరుణ చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాల‌లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న పదేళ్ళలోనే 70 సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది. హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న సమయంలోనే అరుణ బిజినెస్ మ్యాన్ మోహన్ గుప్తా ను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరికి మొత్తం నలుగురు సంతానం ఉండగా ఫ్యామిలీ అంతా అమెరికాలో సెటిల్ అయ్యారు. రీసెంట్ గా అరుణ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా అని తెరిచింది. వంటలు, హెల్తీ లైఫ్ స్టైల్, వ్యాయామం లాంటి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. అంతే కాకుండా ఇప్ప‌టికే ఇన్స్ట్రా గ్రామ్ లో 70 వేలకు పైగా ఫాలోవర్ ల ను సొంతం చేసుకుంది.

Visitors Are Also Reading