Home » నిర్మాత, రాజ్యసభ నామినేట్ సభ్యుడు నిరంజన్ రెడ్డి గురించి మీకు తెలియని విషయాలు…?

నిర్మాత, రాజ్యసభ నామినేట్ సభ్యుడు నిరంజన్ రెడ్డి గురించి మీకు తెలియని విషయాలు…?

by Azhar
Ad

ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే ఆ నాలుగు సభ్యులు ఎవరు అనే విషయంలో చాలా చర్చ జరిగింది. ఈ విషయంలో చాలా పేర్లు వినిపించాయి. ప్రముఖ నటుడు, కమిడియన్ ఆలీకి ఈ రాజ్యసభ హోదా దక్కే అవకాశం ఉంది అనే ప్రపంచం కూడా బాగానే నడిచింది. ఈ విషయంలో విజయసాయి రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణలతో సుదీర్ఘ చర్చ తర్వాత… ఆయా నాలుగు ఎవరు అనేది ప్రకటించారు సీఎం జగన్. అయితే అందరూ అనుకున్నట్లు నటుడు ఆలీకి ఇందులో అవకాశం దక్కకపోయినా.. సినిమా రంగానికి చెందిన నిర్మాత నిరంజన్ రెడ్డికి అవకాశం వచ్చింది.

Advertisement

అయితే నిరంజన్ రెడ్డి… 1970 జూలై 22 న జన్మించి… పూణేలోని సింబాయాసిస్ లా కాలేజీలో ‘లా’ చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ విడిపోక ముందు… సీనియర్ లాయర్స్ ఒ. మనోహర్ రెడ్డి, కే.ప్రతాప్ రెడ్డి వద్ద పని చేసిన ఈయన… 2011 నుండి ఇప్పటి సీఎం జగన్ మీద పాడు ఫైల్ అయిన సీబీఐ కేసును కోర్టులో వాదిస్తున్నారు. అయితే ఈయనకు 2016లో ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది హోదాను ఇచ్చింది. ఇక ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించిన ఈయనను… వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకుంది.

Advertisement

అయితే ఒక్క న్యాయవాదిగానే కాకుండా నిరంజన్ రెడ్డికి సినిమాలు అంటే ఎంతో అభిమానం ఉండటంతో.. సినిమా రంగంలోని ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టారు. అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాతో పాటుగా… ఘాజీ, వైల్డ్ డాగ్‌తో పాటు అర్జున ఫల్గుణ సినిమాలతో మంచి నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు. కానీ ఈ మధ్యే మెగా స్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ఇర్మించిన ఆచార్య సినిమా మాత్రం జనాలను ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా దాదాపు 80 కోట్ల నష్టాన్ని చూడాలి వచ్చింది.

ఇవి కూడా చదవండి :

2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!

నేను ఆ ఓవర్ వేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలిచేది..!

Visitors Are Also Reading