Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా పోస్ట‌ర్ లో ఇంత మ్యాట‌ర్ ఉందా..? అంటే అర్థం ఏంటంటే..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా పోస్ట‌ర్ లో ఇంత మ్యాట‌ర్ ఉందా..? అంటే అర్థం ఏంటంటే..?

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాలను సైతం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా తెరకెక్కుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయ్యింది.

Advertisement

ఈ సినిమా అఫీషియల్ ప్రకటన కూడా విడుద‌ల చేశారు. సుజిత్ ఇప్పటికే ప్రభాస్ తో సాహో సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. దాంతో ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ సినిమా పోస్టర్ ను సైతం సుజిత్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. అసలు సినిమా టైటిల్ ఏంటి అన్నది కూడా అభిమానులకు అర్థం కాకుండా పోస్టర్ కనిపిస్తోంది. పోస్ట‌ర్ లో ఓజి అనే అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఓజి అంటే ఏంటి…? అని నెటిజన్ లు ఆలోచ‌న‌లో పడ్డారు.

Advertisement

అయితే కొంత‌మంది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ దానిని ఢీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. అలా చేయగా ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే అర్థం వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఫోటో పై రాసి ఉన్న భాష జపనీస్ లో ఉంది. ఆ జపనీస్ లో ఉన్న పదాలకు అర్థం అగ్ని తుఫాన్ అని వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నీడలో ఒక గన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ముందు వృత్తాకారంగా జపాన్ జాతీయ జెండా సైతం మనకు కనిపిస్తోంది.

అదేవిధంగా ఈ పోస్టర్ లో ఒకవైపు విగ్రహం ఆకారం సైతం ఉంది. అయితే ఆ విగ్రహం జపాన్ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం గా సమాచారం. ఆ విగ్రహం జపాన్ లోని ఖుషి ప్రాంతానికి చెందినదిగా సమాచారం. ఇక పోస్టర్ లో మరోవైపు చూస్తే ఇండియాలోని గేట్ వే ఆఫ్ ఇండియా మనకు కనిపిస్తుంది. దాంతో ఈ సినిమా కథ జపాన్ మరియు ముంబై నేపథ్యంలో సాగే అవకాశం ఉందని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading