Home » చ‌క్రి చనిపోయిన త‌ర‌వాత ఆయ‌న భార్య ఎక్క‌డ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే.?

చ‌క్రి చనిపోయిన త‌ర‌వాత ఆయ‌న భార్య ఎక్క‌డ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే.?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ లుగా రానించిన‌వారిలో చ‌క్రి కూడా ఒకరు. వ‌రంగ‌ల్ కు చెందిన చ‌క్రి సంగీతం పై ఇష్టంతో క‌ష్ట‌ప‌డి సంగీత ద‌ర్శ‌కుడుగా ఎదిగారు. ఎన్నో బ్లాక్ బస్ట‌ర్ సినిమాల‌కు చ‌క్రి స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. ఇడియ‌ట్ దేశ‌ముదురు, శివ‌మ‌ణి లాంటి సినిమాల‌కు ఆయ‌న ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంది. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు వినిపిస్తూనే ఉంటాయి.

Advertisement

 

అయితే తాజాగా చక్రి సోద‌రుడు మహిత్ నారాయ‌ణ ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. చ‌క్రి అన్న‌య్య ఉన్న‌ప్పుడు ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని కానీ ఆయ‌న చ‌నిపోయిన త‌ర‌వాత ఆస్తి గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. అన్న‌య్య లేడ‌నే బాధ‌కి తోడు గొడ‌వ‌ల‌తోనూ న‌ర‌కం అనుభవించామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Advertisement

అంతే కాకుండా అన్న‌య్య ఆస్తుల్లో కొన్నింటింని ఆయ‌న భార్య అమ్మేసుకుని అమెరికాకు వెళ్లిపోయింద‌ని అన్నారు. అక్క‌డే హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింద‌ని అన్నారు. ఇక త‌మ‌కు చెందిన మ‌రికొన్ని ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నాయ‌ని తెలిపాడు. ఇదిలా ఉంటే చ‌క్రి 2014లో గుండె పోటుతో మ‌ర‌ణించారు.

చక్రి ఊబ‌కాయ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు. దానివ‌ల్లే ఆయ‌న చిన్న‌వ‌య‌సులోనే గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఇక చక్రి చ‌నిపోయిన వెంట‌నే వారి కుటుంబంలో ఆస్తుల వివాదాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న భార్య మీడియాలో త‌నను చక్రి కుటుంబ స‌భ్యులు వేధిస్తున్నార‌ని ఆరోపించారు. మ‌రోవైపు చ‌క్రి కుటుంబ స‌భ్యులు ఆమె పై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ALSO READ : రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

Visitors Are Also Reading