టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవి మధ్య సైలెంట్ వార్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య వార్ ఇప్పుడు మొదలైంది కాదు. 30 ఏళ్ల క్రితమే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Advertisement
అయితే ఆ గొడవలు కూడా కాంపిటేషన్ వల్ల వచ్చినవట. పెద్ద హీరోల హవా తగ్గిన తరవాత టాలీవుడ్ లో నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి, మోహన్ బాబు లు కీలకంగా మారారు. అప్పుడు పోటా పోటీగా సినిమా లు చేసేవారు.
Also Read: “భీమ్లా నాయక్” ట్రైలర్ లో ఈ తప్పులు గమనించారా…!
ఇలాంటి సమయంలో వరుస ఫ్లాప్ లతో ఉన్న దాసరి నారాయణ రావు నిర్మత డీ రామానాయుడు తో ఓ ఇంటర్వ్యూను ఇచ్చారు. అయితే అప్పట్లో దాసరి ఎప్పుడూ చిరంజీవి గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదట. కానీ ఆ ఇంటర్వ్యూలో దాసరి చిరంజీవి గురించి చెప్పేలా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారాట. మీకు యువ హీరోలలో ఎవరంటే ఇష్టం…అని ప్రశ్నించగా అందరూ బాగా చేస్తున్నారు.
Advertisement
హిట్లు పడుతున్నాయని సమాధానం ఇచ్చారట. ఎన్టీఆర్ తరవాత మళ్లీ స్టార్ హీరో ఎవరవుతారని ప్రశ్నించారట. సమాధానం ఇవ్వకపోవడంతో మీరు యువ హీరోల గురించి మాట్లాడటానికి బయపడుతున్నారా అని మరో ప్రశ్నవేశారట. దానికి దాసరి నేను స్టార్ దర్శకుడిని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో హిట్లు కొట్టాను..చిరంజీవి ఇప్పుడు స్టార్ హీరో అనడంలో సందేహం అవసరం లేదు.
ఆయన పోస్టర్ చూసి సినిమాలకు వస్తున్నారు. కానీ స్టార్ కంటే నటుడే గొప్పవాడు. ఒక మెట్టు పైనే ఉంటాడు..డైలాగులు చెప్పడంలో ఆయనే గొప్పవాడు అంటూ సమాధానం ఇచ్చాడు. దాసరి చిరంజీవి స్టార్ హీరో అని ఒప్పుకున్నప్పటికీ అతడి కంటే మోహన్ బాబు గొప్పనటుడు అని చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఇంటర్వ్యూ 1992 ఆగస్టు 26న అన్ని దినపత్రికలలో వచ్చింది.
Also Read: “నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా” అంటూ నెటిజన్ దారుణం….రిప్లై తో రాడ్ దింపిన సమంత..!