సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు సంబంధించి చాలా రకాల చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే అలా చక్కర్లు కొట్టే అన్ని వార్తలు కూడా నిజాలు కావు. చాలా వరకు ఫేక్ వార్తలు కూడా ఉంటాయి. రీసెంట్ గా మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్ కు ఇప్పటికే ఓసారి పెళ్లి జరగ్గా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. కాగా రీసెంట్ గా భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మంచు లక్ష్మీ దగ్గరుండి జరిపించారు.
Advertisement
అంతే కాకుండా వివాహం కూడా మంచు లక్ష్మి ఇంట్లోనే జరిగింది. అయితే ఈ పెళ్లిలో లక్ష్మీ తో పాటూ ఆమె భర్త కూడా కనిపించారు. మంచు లక్ష్మీ భర్త ఫోటోలు గతంలో వైరల్ అయినప్పటికీ ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. అంతే కాకుండా ఇద్దరూ విడాకులు తీసుకున్నారని మంచు లక్ష్మీ భర్తతో విడాకులు తీసుకుందని రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
Advertisement
ALSO READ :సీనియర్ ఎన్టీఆర్ ఆ ఆభరణాలను దాచిపెట్టడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే..!
కానీ మంచు మనోజ్ పెళ్లిలో లక్ష్మీ భర్త ఆండీ శ్రీనివాసన్ కనిపించడంతో ఇద్దరూ విడాకులు తీసుకోలేదని అవన్నీ ఫేక్ వార్తలన్నీ అర్థమౌతోంది. శ్రీనివాసన్ లక్ష్మీతో విడిపోలేదు కానీ ఆయన అమెరికాలో ఉంటున్నారు. మంచు లక్ష్మీ ఆండీ శ్రీనివాసన్ ల పెళ్లి 2006 లో జరిగింది.
అయితే వ్యాపారం కోసం ఆయన అమెరికాలో ఉండటం..మంచు లక్ష్మి సినిమాల్లో నటించడం కోసం ఇండియాలో ఉండటంతో ఇద్దరూ ఎక్కువగా మీడియా ముందు కనిపించరు. ఇక మంచు లక్ష్మి శ్రీనివాసన్ లకు ఓ కూతురు ఉంది. వారి కూతురు పేరు విద్య నిర్వాణ కాగా సరోగసి పద్దతి ద్వారా మంచు లక్ష్మి దంపతులు పాపకు జన్మనిచ్చారు.
ALSO READ : బాలకృష్ణని ఆ నిర్మాతలు మోసం చేశారా ? ఆ విషయంలో చిరంజీవినే బెస్ట్..!