Home » కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? ఏం చేసేవాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? ఏం చేసేవాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న సినిమా కేజీఎఫ్ పార్ట్ -2. కేజీఎఫ్ చాప్ట‌ర్-1 కు సీక్వెల్ గా ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల కలెక్ష‌న్ లు రాబ‌ట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోలార్ బొగ్గుగ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇక సినిమాలో హీరో ఎలివేష‌న్స్ కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి.అంతే కాకుండా సినిమాలో మ్యూజిక్ కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

Advertisement

థియేట‌ర్ ల‌లో హీరో ఎంట్రి సీన్ల స‌మ‌యంలో వ‌చ్చే మ్యూజిక్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. దాంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని అంద‌రూ నెట్టింట వెత‌క‌డం మొద‌లు పెట్టారు. అయితే చాలా మంది సినిమాల్లోకి వ‌చ్చేవారు. గోల్డెన్ స్పూన్ తో పుడ‌తారు. కానీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ రవి బ‌స్రూర్ మాత్రం పుట్టింది గోల్డెన్ స్పూన్ తో కాదు. మండే కొలిమిలో ఎంతో క‌ష్ట‌ప‌డి గోల్డెన్ స్పూన్ లు త‌యారు చేస్తూ బ‌తికే పేద కుటుంబంలో.

Advertisement

ర‌వి బ‌స్రూర్ తండ్రి గోల్డ్ స్మిత్ త‌న కొడుకు ఎంతో పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయినా ఇప్ప‌టికీ తండ్రి మాత్రం త‌న వృత్తినే న‌మ్ముకుని బ‌తుకుతున్నాడు. ర‌వి బ‌స్రూర్ లాక్ డౌన్ స‌మ‌యంలో పని లేక‌పోవ‌డంతో త‌న స్వ‌గ్రామానికి వెళ్లిపోయాడు. అక్క‌డ త‌న తండ్రి చేసే ప‌ని చేస్తూ కుటుంబానికి సాయ‌ప‌డ్డాడు. ర‌వి బ‌స్రూర్ కు సంగీతం పై ఉన్న ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు.

త‌న మొద‌టి సినిమా కూడా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తోనే చేశాడు. 2014లో వ‌చ్చిన ఉగ్ర‌మ్ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రవి బ‌స్రూర్ స్వరాలు స‌మ‌కూర్చారు. ఆ త‌వ‌రాత కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 ల‌కు కూడా మ్యూజిక్ అందించాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న స‌లార్ సినిమాకు కూడా ర‌విబ‌స్రూర్ స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. అలా పేద కుటుంబం నుండి వ‌చ్చి బ‌డా హీరోల సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ర‌వి బస్రూర్ జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం.

ఇవి కూడా చదవండి : 

పవన్, ప్రభాస్ లపై కొమురం పులి హీరోయిన్ హాట్ కామెంట్స్…! 

నాగచైతన్య రెండో పెళ్లిపై.. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే..!!

Visitors Are Also Reading