Home » KGFలో అమ్మ‌గా న‌టించిన అమ్మాయి ఎవ‌రో తెలుసా..? ఆమె వ‌య‌సు తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

KGFలో అమ్మ‌గా న‌టించిన అమ్మాయి ఎవ‌రో తెలుసా..? ఆమె వ‌య‌సు తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

by AJAY
Ad

ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రికార్డులు సృష్టించిన‌ సినిమా కేజీఎఫ్. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చిన ఈ సినిమాకు దేశ‌వ్యాప్తంగా అభిమానులు అయ్యారు.

Advertisement

పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన ఈ సినిమాలోని భారీ విజువ‌ల్స్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించాయి. బాహుబ‌లి త‌ర‌వాత అంత‌టి క్రేజ్ వ‌చ్చిన సినిమాగా కేజీఎఫ్ నిలిచింది. అయితే బాహుబ‌లికి విడుద‌ల‌కు ముందే క్రేజ్ ఉంది.

 

కానీ కేజీఎఫ్ కు మాత్రం ఎలాంటి క్రేజ్ లేకుండా వ‌చ్చి విజ‌యం సాధించ‌డ‌మే అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది.ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వ‌రుస సినిమాలు చేస్తున్నారు. అంతే కాకుండా స్టార్ హీరోల‌తో ప్ర‌శాంత్ సినిమాల‌ను లైన్ లో పెడుతున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సినిమాలో హీరోగా న‌టించిన య‌శ్ తో పాటూ న‌టిన‌టులు అంద‌రికీ ఎంతో గుర్తింపు వ‌చ్చింది.

Advertisement

ముఖ్యంగా ఈ సినిమాలో య‌శ్ త‌ల్లిగా న‌టించిన న‌టికి కూడా ఎంతో గుర్తింపు వ‌చ్చింది. య‌శ్ చిన్న తనంలోనే తల్లి మ‌ర‌ణిస్తుంది అన్న సంగ‌తి తెలిసిందే. ఉన్న కొద్దిసేపు అయినా య‌శ్ త‌ల్లిగా నటించిన న‌టి ఎంతో మెచ్యూర్ యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఆ త‌ర‌వాత త‌ల్లి సెంటిమెంట్ తోనే సినిమా మొత్తం న‌డుస్తుంది.

ఇక సినిమాలో య‌శ్ కు త‌ల్లిగా నటి పేరు అర్చ‌న జైస్…కాగా ఆమె వ‌యసు కేవ‌లం 26 ఏళ్లు మాత్ర‌మే. మూడేళ్ల క్రిత‌మే అర్చ‌న జైస్ వివాహం కూడా జ‌రిగింది. అయితే అర్చ‌న జైస్ కేవ‌లం 26 ఏళ్ల వ‌య‌సులోనే త‌ల్లిగా న‌టించడం చెప్పుకోద‌గ్గ విష‌యం. కెరీర్ ప్రారంభంలో గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికే న‌టీమ‌ణులు ఆస‌క్తి చూపిస్తారు. కానీ అర్చ‌న జైస్ అలాంటి బౌండ‌రీలు పెట్టుకోకుండా త‌ల్లి పాత్ర చేయ‌డంతో పాటూ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇవి కూడా చదవండి : జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..?

Visitors Are Also Reading