Home » కాంతార సినిమాలో నిప్పులు కక్కుతున్న ఆ కళ్ళు ఎవరివో తెలుసా…? ఆ కళ్ళ వెనక ఉన్న కథ ఏంటంటే…?

కాంతార సినిమాలో నిప్పులు కక్కుతున్న ఆ కళ్ళు ఎవరివో తెలుసా…? ఆ కళ్ళ వెనక ఉన్న కథ ఏంటంటే…?

by AJAY
Ad

ఇటీవల విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తున్న సినిమా కాంతార. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. కేజీఎఫ్ సినిమా తర్వాత మళ్లీ కన్నడ సినిమాకు అంతటి గుర్తింపును తెచ్చిపెట్టింది కాంతార‌. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రానికి రిష‌బ్ శెట్టినే దర్శకత్వం వహించారు.

 

ఈ సినిమా కర్ణాటకలోని ఒక ప్రాంతంలో జరిగే ఆచారం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో రిష‌బ్ శెట్టి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమాలోని చాలా సీన్లు ప్రేక్షకులను ఫిదా చేశాయి. అంతే కాకుండా సినిమాలో దేవుడి గెటప్ లో నటించిన నటుడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నిప్పులు కక్కే కళ్ళతో దేవుడి పాత్ర‌లో కనిపించి థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు.

Advertisement

Advertisement

దాంతో ఆ కళ్ళు ఎవరివి ఆ నటుడు ఎవరు అని ప్రేక్షకులు వెతికే పనిలో ఉన్నారు. కాగా దైవం పాత్రలో నటించిన వ్యక్తి పేరు నవీన్ బొండే. ఆయన మంగుళూరు ప్రాంతంలో కండక్టర్ గా పని చేసేవాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నటకాల్లో నటించేవాడు. ఈ క్రమంలోనే తులు భాషలో చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించాడు.

అయితే కాంతార సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని ఓ వీడియోను క్లిప్ ను రికార్డ్ చేసి పంపించాడట. ఆ వీడియో చూసిన రిష‌బ్ శెట్టి ఆయ‌న‌కు పిలిచి అవ‌కాశం ఇచ్చారు. దాంతో దైవం పాత్రలో ఛాన్స్ ఇవ్వడంతో నవీన్ బండే తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఈ సినిమాతో నవీన్ బండే కి ఎంతో గుర్తింపు వచ్చింది.

Visitors Are Also Reading