Home » జ‌బ‌ర్ద‌స్త్ వినోద్ భార్య‌కు సీమంతం చేసిన సుమ‌…క‌న్నీటిప‌ర్యంత‌మైన క‌మెడియ‌న్..!

జ‌బ‌ర్ద‌స్త్ వినోద్ భార్య‌కు సీమంతం చేసిన సుమ‌…క‌న్నీటిప‌ర్యంత‌మైన క‌మెడియ‌న్..!

by AJAY
Ad

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఈ షోలో స‌క్సెస్ అయిన వాళ్ల‌లో కొంత‌మంది సినిమాల‌తో బిజీగా ఉండ‌గా మ‌రికొంద‌రు ఇదే షోలో కొన‌సాగుతూ ఇత‌ర ఈవెంట్ల‌కు వెళుతున్నారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ కూడా ఒక‌రు. వినోద్ అంటే గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ వినోద్ అలియాస్ వినోదిని అంటే మాత్రం గుర్తుప‌ట్ట‌ని వారుండ‌రు. వినోద్ ను అంద‌రూ ట్రాన్స్ జండ‌ర్ అనుకుంటారు కానీ అత‌డు ట్రాన్స్ జెండర్ కాదు.

Advertisement

జ‌బ‌ర్ద‌స్త్ లో షో మొద‌టి నుండి స్త్రీ గెట‌ప్ లో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంతో ఇప్ప‌టికీ అదే గెట‌ప్ లో క‌నిపిస్తుంటాడు. కేవలం జ‌బ‌ర్ద‌స్త్ అనే కాకుండా ఏ ఈవెంట్ కు వెళ్లినా కూడా వినోద్ అదే గెట‌ప్ లో క‌నిపిస్తూ ఉంటాడు. నిజానికి వినోద్ చూడ్డానికి అచ్చం అమ్మాయిలా కనిపించ‌డంతో ముందు అంతా అవాక్కయ్యారు. ఎంతో అందంగా ఉంద‌ని అనుకున్నారు. కానీ అత‌డు అబ్బాయ‌ని తెలిసి షాక్ అయ్యారు.

Advertisement

చంద్ర స్కిట్ ల‌లో చేసి వినోద్ ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండ‌గా లాక్ డౌన్ లో చాలా మంది వివాహాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే అదే లాక్ డౌన్ స‌మయంలో వినోద్ కూడా త‌న అత్త కూతురు విజ‌య‌ల‌క్షిని వివాహం చేసుకున్నాడు. విజ‌య‌ల‌క్ష్మిది క‌డ‌ప కాగా త‌న భార్య‌ను ముద్దుగా విజ్జు అని పిలుచుకుంటా అంటూ వినోద్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో చేసిన ఓ వీడియోలో తెలిపాడు.

ALSO READ : టీడీపీ నుండి అలీ అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు..శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

ఇదిలా ఉండ‌గా రీసెంట్ గా జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ లు కొంద‌రు త‌మ భార్య‌ల‌తో క‌లిసి క్యాష్ షోకు వ‌చ్చారు. వినోద్ కూడా త‌న భార్య‌తో షోలో సంద‌డి చేశాడు. అయితే యాంక‌ర్ సుమ వినోద్ భార్య విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని గుర్తించింది. దాంతో తాను సీమంతం చేస్తాన‌ని చెప్పి రెడీ చేసి సీమంతం చేశారు. అంతే కాకుండా యాంక‌ర్ సుమ మాట్లాడుతూ… విజ‌య‌ల‌క్ష్మికి త‌ల్లి లేద‌ని ఉంటే సీమంతం చేసేద‌ని..ఇప్పుడు తాను సీమంతం చేశాను కాబ‌ట్టి త‌న‌ను త‌ల్లిలా భావించవ‌చ్చ‌ని చెప్పింది. మరోవైపు వినోద్ కూడా త‌న తండ్రి ఇటీవ‌లే చ‌నిపోయాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

Visitors Are Also Reading