Home » జబర్దస్త్ లో నటించే కమీడియన్ నరేష్ వయసు ఎంతో తెలుసా ? అతని జీవితం లో ఎంత విషాదముందంటే ..!

జబర్దస్త్ లో నటించే కమీడియన్ నరేష్ వయసు ఎంతో తెలుసా ? అతని జీవితం లో ఎంత విషాదముందంటే ..!

by AJAY
Ad

ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ఖ‌త‌ర్నాక్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది క‌మెడియ‌న్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షో కొన్నేళ్ల నుండి ప్ర‌సార‌మ‌వుతున్నా కూడా క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం విశేషం. ఇక ఈ షో ద్వారానే పాపులారిటీ సంపాదించిన వారిలో క‌మెడియ‌న న‌రేష్ కూడా ఒక‌రు. చూడ్డానికి ప‌దేళ్ల కుర్రాడిలా క‌నిపించే న‌రేష్ వ‌య‌సు ప్ర‌స్తుతం ఇర‌వై ఏళ్లు..ఈ విష‌యాన్ని న‌రేష్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అంతే కాకుండా న‌రేష్ ఇంట‌ర్వ్యోలో ప‌లు ఆస‌క్తిక‌ర విషాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. న‌రేష్ తెలంగాణ‌లోని జ‌న‌గామ జిల్లా అనంత‌పుర గ్రామానికి చెందిన‌వాడు.

Advertisement

Advertisement

చిన్న‌నాటి నుండి న‌రేష్ కు ఎదుగుద‌ల స‌మ‌స్య మొద‌లైంది. ఎన్నో ఆస్ప‌త్రులు తిరిగినా కూడా ఫ‌లితం లేకుండా పోయింది. కానీ న‌రేష్ కు చిన్న‌నాటి నుండి ఎంతో టాలెంట్ ఉంది. అత‌డికి డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ త‌ర‌వాత ఢీ షోలో అవ‌కాశం రావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. కానీ ఈ షో ద్వారా న‌రేష్ కు పెద్ద‌గా పాపులారిటీ రాలేదు. ఢీలో ఉన్న‌ప్పుడే న‌రేష్ కు న‌ట‌న‌పై ఆస‌క్తి పెరిగింది. ఈ షో పూర్త‌యిన త‌రవాత న‌రేష్ అన్న‌పూర్ణ స్టూడియో గేటు వ‌ద్ద ప‌డిగాపులు కాచేవాడ‌ట‌. అయితే ఒక‌రోజు న‌రేష్ ను చూసిన సునామీ సుధాకర్ చ‌లాకీ చంటీకి ప‌రిచ‌యం చేశాడు.

jabardasth naresh

jabardasth naresh

దాంతో చంటీ అత‌డిని వెంట‌నే టీమ్ లో చేర్చుకున్నాడు. ఆ త‌ర‌వాత కొంత కాల‌నికి న‌రేష్ బుల్లెట్ భాస్క‌ర్ టీంలో చేరాడు. ఇక బుల్లెట్ భాస్క‌ర్ టీం చేరిన త‌ర‌వాత న‌రేష్ కామెడీ టైమింగ్ అత‌డు వేసే పంచ్ ల‌తో ఎంత పాపుల‌ర్ అయ్యాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే జీవితంలో ఎంతో స‌క్సెస్ అయిన న‌రేష్ ఇంట‌ర్వ్యూలో ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న‌కు ఎదుగుద‌ల లోపం ఉంద‌ని చాలా మంది డాక్ట‌ర్ల‌ను క‌లిసినా దానికి ప‌రిష్కారం లేద‌ని చెప్పాడు. ఒక‌వేళ పెరిగే ఛాన్స్ ఉన్నా అది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని తెలిపాడు.

Visitors Are Also Reading