Home » JABARDASTH : జ‌బ‌ర్ద‌స్త్ న‌వ్వుల వెన‌క ఇంత జ‌రుగుతుందా…!

JABARDASTH : జ‌బ‌ర్ద‌స్త్ న‌వ్వుల వెన‌క ఇంత జ‌రుగుతుందా…!

by AJAY

తెలుగులో అతిపెద్ద కామెడీ షో ఏద‌ని అడిగితే జ‌బ‌ర్ద‌స్త్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ లో కంటెస్టెంట్ లు స్కిట్ లు చేయ‌డం. జ‌డ్జిలు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డం అదంతా చూసి ప్రేక్ష‌కులు కూడా న‌వ్వ‌డం స్కిట్ ను ఎంజాయ్ చేయ‌డం జ‌రుగుతంది. అయితే జ‌బ‌ర్దస్త్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ న‌టుడు చెప్పిన మాట‌లు వింటే మాత్రం ఆశ్చ‌ర్య‌పోక‌త‌ప్ప‌దు. బిగ్ బాస్ నుండి బ‌య‌టకు వచ్చిన న‌టుడు మ‌హీద‌ర్ సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టాడు. కొన్ని సార్లు నాగ‌బాబు రోజా స్కిట్ పూర్త‌య్యాక అస‌లు స్కిట్ పేరు ఏంట‌ని అడిగి ఆ త‌రావ‌త మార్కులు వేస్తార‌ని అన్నారు.

అంతే కాకుండా గ‌తంలో న‌వ్విన వీడియోల‌ను కూడా ఇత‌ర వీడియోల‌కు ఎడిటింగ్ స‌మ‌యంలో యాకొడ్ చేస్తార‌ని చెప్పారు. ఏ స్కిట్ బాగుందో చెప్ప‌డంతో మొద‌ట్లో నాగ‌బాబు గారిదే న‌డిచేద‌ని అన్నారు. రోజా గారు కూడా నాగ‌బాబును అడిగే ఏ స్కిట్ బాగుందో చెప్పేవార‌ని అన్నారు. కానీ డిసిష‌న్ మాత్రం నాగ‌బాబుదే ఉండేద‌ని చెప్పారు.

ALSO READ : చైతూతో మ‌ళ్లీ క‌లిసే అవ‌కాశం లేకుండా చేసిన స‌మంత‌..!

అంతే కాకుండా కొంత‌మంది క‌మెడియ‌న్ లు జ‌డ్జిల‌ను పొగిడేవార‌ని సినిమాల అవ‌కాశం కోసమో లేదంటే త‌మ పేరు ప్ర‌స్తావిస్తే పాపుల‌ర్ అయ్యే అవ‌కాశం ఉంద‌నో జ‌డ్జిల‌ను పొగ‌డ‌టం కూడా ఉండేద‌ని చెప్పారు. జ‌డ్జిలు తిట్టిన వీడియోల‌ను ఎడిట్ చేసి వారు స్కిట్ చూసి న‌వ్విన‌ట్టు కూడా ఎడిట్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని మ‌హిద‌ర్ తెలిపారు. అంతే కాకుండా వారానికి రెండు రోజు మాత్రమే జ‌బ‌ర్ద‌స్త్ షూటింగ్ ఉంటుంద‌న్నారు.

ముందు రోజు రిహాల్స‌స్ ఉంటాయ‌ని ఆ త‌ర‌వాత రోజున స్కిట్ ఉంటుంద‌ని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ రెండూ కలిపి నాలుగు రోజుల షూటింగ్ ఉంటుంద‌ని చెప్పారు. అయితే అప్ప‌ట్లో ఎపిసోడ్ షూటింగ్ కు ఒక రోజంతా ప‌ట్టేద‌ని కానీ ఇప్పుడు ముందుగానే ప్రాక్టీస్ చేసి ర‌మ్మంటున్నార‌ని దాంతో ఒకే రోజులో పూర్త‌వుతుంద‌ని మ‌హీద‌ర్ వెల్ల‌డించారు.

Visitors Are Also Reading