చిత్రం సినిమాతో టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ. ఈ సినిమాతో తేజ టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత తేజ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే చాలా కాలం పాటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజ మళ్లీ రానా కాజల్ జంటగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Advertisement
ఇక ప్రస్తుతం తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. అందులో రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి నటిస్తున్న అహింస కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగానే తేజ ఈ నెల 22న తన పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రకటించారు. వాటిలో విక్రమాదిత్య సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది.
Advertisement
Advertisement
ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. 18 శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తేజ తనయుడు అమితవ్ లీడ్ రోల్ పోశించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు సన్నహాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా దర్శకుడి విభిన్న చిత్రాలను తెరకెక్కించే తేజ తనయుడు ఇండస్ట్రీలో ఏ మేరకు సక్సెస్ అవుతారా చూడాలి. ఇదిలా ఉండగా తేజ కొడుకు అమితవ్ ఇప్పటికే విదేశాల్లో యాక్టింగ్ కోర్సులో శిక్షణ కూడా తీసుకున్నారట. అయితే అమితవ్ ఫోటోలు ఒకటి తప్ప మరెవీ బయటకు రాలేదు. దాంతో తేజ తనయుడిని ఏకంగా సినిమాలో చూసేందుకు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.