చాలా మంది హీరోయిన్ లు కొన్ని సినిమాల్లో నటించిన ఆ తరవాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. ఇక అలా దూరమైన హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. కొంతమంది ఇతర రంగాలలో స్థిరపడితే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతారు. ఇక అలా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ లలో నితిన్ దిల్ సినిమా హీరోయిన్ కూడా ఒకరు. దిల్ సినిమాలో నితిన్ కు జోడీగా హీరోయిన్ నేహా నటించింది.
Advertisement
ALSO READ :ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?
అయితే ఈ సినిమా కంటే మందే నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆ తరవాత దిల్ రాజు బ్యానర్ లో దిల్ సినిమాలో హీరోగా నటిచగా ఈ సినిమా అంతకు మించి హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో నేహా నితిన్ కు జోడీగా నటించి తన నటనతో మెప్పించింది.
Advertisement
ఈ సినిమా తరవాత నేహా అతడే ఒకసైన్యం, బొమ్మరిల్లు సినిమాలలో కూడా నటించి అలరించింది. అయితే దిల్ తరవాత ఆ రేంజ్ హిట్ మాత్రం నేహాకు పడలేదు. దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక సినిమా ఆఫర్ లు లేకపోవడంతో నేహా సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఆ తరవాత రిషి అనే వ్యక్తిని 2007 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.
పెళ్లి తరవాత ఇద్దరూ మూడేళ్లపాటూ కలిసి మెలిసి ఉన్నారు. కానీ ఆ తరవాత ఏం జరిగిందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నేహా కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇక ఆ తరవాత నేహా ఎలా ఉంటుంది.? ఏం చేస్తుంది అన్న వివరాలు సైతం బయటకు రాలేదు. అంతే కాకుండా ఈ హీరోయిన్ సోషల్ మీడియాకు సైతం దూరం గానే ఉంటుంది.
Advertisement
ALSO READ :సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!