Home » మెగాస్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీకి కార‌ణ‌మైన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీకి కార‌ణ‌మైన సినిమా ఏంటో తెలుసా..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 2008లో చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలు తనకు సెట్ కావని తెలుసుకున్న మెగాస్టార్ అందులో నుంచి బయటకు వచ్చారు. కానీ ఇప్పటి వ‌ర‌కూ చిరు రాజకీయాల్లో కొనసాగి ఉంటే సీఎం అయ్యే వారిని… ప్రతిపక్షంలో అయినా కచ్చితంగా ఉండేవారు అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ చిరు మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పాక ప్రశాంతంగా ఉందంటూ పలుమార్లు కామెంట్లు కూడా చేశారు.

mutamestri

mutamestri

అయితే నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి రావడం వెనక ఓ సినిమా కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే అప్పట్లో క్రేజ్ ఉండేది. వీరి కాంబోలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. వీరి కాంబోలో కొండవీటి దొంగ సినిమా తర్వాత చాలా కాలం పాటు సినిమాలు రాలేదు. దాంతో ఇద్దరూ విడిపోయారు అని ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ ప్రచారమంతా అవాస్తవమని 1993లో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ముఠామేస్త్రి సినిమా నిరూపించింది.

Advertisement

Advertisement

prajarajyam

prajarajyam

ఈ సినిమాలో మెగాస్టార్ ఓ సాధారణ మార్కెట్ యార్డ్ లో పనిచేసే కూలీ గా నటించాడు. అయితే సినిమాలో అనుకోకుండా చిరంజీవి ముఖ్య మంత్రి అవుతారు. ఈ సినిమా చివ‌ర‌లో మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం వ‌స్తే పిల‌వండి స్పీడైపోతా..అంటూ చిరు డైలాగ్ కొడ‌తారు. ఈ డైలాగును కోదండరామిరెడ్డి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ తో స్పెష‌ల్ గా రాయించార‌ట‌. ఈ సినిమా వ‌చ్చిన త‌ర‌వాత‌నే మెగాస్టార్ రాజ‌కీయాల్లోకి రావాల‌నే కోరిక అభిమానుల్లో పుట్టింది. అప్ప‌టి నుండి మెగాస్టార్ ఎక్క‌డ క‌నిపించినా కాబోయే సీఎం అని ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని నినాదాలు కూడా మొద‌లయ్యాయి. ఇక ఠాగూర్, ఇంద్ర సినిమాల త‌ర‌వాత మెగాస్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు ఎక్కువ‌గా ఆశ‌ప‌డ్డారు. అలా మెగాస్టార్ 2008లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు.

Visitors Are Also Reading