Home » భీమ్లా నాయ‌క్ లో కీల‌కపాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా…!

భీమ్లా నాయ‌క్ లో కీల‌కపాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా…!

by AJAY
Ad

ఒక‌ప్ప‌డు సినిమా అవ‌కాశాలు రావాలంటే ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి న‌టించే టాలెంట్ ఉంటే అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ల‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న వారికి సినిమా అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అంతే కాకుండా టిక్ టాక్ ల‌తో మెప్పించిన వారికి రీల్స్ తో ఆక‌ట్టుకున్నవారికి కూడా అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అయితే అంద‌రికీ సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌చ్చు.

Advertisement

ALSO READ : “భీమ్లా నాయక్” లో రానాకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరంటే…?

కొంత‌మందికి బుల్లి తెర‌పై అవ‌కావాలు వ‌స్తే మ‌రికొంద‌రికి నేరుగా వెండితెర‌పైనే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించగా ఆయ‌న ప‌క్కన లేడీ పోలీస్ పాత్ర‌లో మౌనికా రెడ్డి అనే అమ్మాయి హ‌రిని గా న‌టించింది.

Advertisement

అయితే మౌనికా రెడ్డి కూడ యూట్యూబ్ లో టాలెంట్ ను నిరూపించుకుని సినిమా అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. భీమ్లా నాయ‌క్ సినిమాలో ఏకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న న‌టించే చాన్స్ ద‌క్కించుకుంది. ఇక మౌనికా రెడ్డి యూట్యూబ్ లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సూర్య అనే వెబ్ సిరీస్ లో న‌టించి అల‌రించింది. ఈ వెబ్ సిరీస్ లో వచ్చిన గుర్తింపు తోనే భామ్లా నాయక్ ఛాన్స్ వ‌చ్చింది.

ఈ సినిమాలో కూడా మౌనికా రెడ్డి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. దాంతో వ‌రుస ఆఫ‌ర్ల అందుకుంటోంది. ఇప్పటికే నిఖిల్ హీరోగా న‌టిస్తున్న 18 పేజీస్ సినిమాలో న‌టిస్తోంది. ఆహా, సోనీ లైవ్ ఓటిటి లో ప‌లు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది. విశ్వ‌క్ ఓరిదేవుడా సినిమాలో కూడా న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. మౌనికా రెడ్డి వైజాగ్ బీటెక్ పూర్తిచేయ‌గా…ప్ర‌స్తుతం హెచ్ ఆర్ గా ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. ఇక టాలెంట్ అదృష్టంతో ఇప్పుడు సినిమా ఛాన్స్ లు సైతం ద‌క్కించుకుంది.

Visitors Are Also Reading