Home » అల‌ వైకుంఠ‌పుర‌ములో సినిమా న‌టుడి భార్య కూడా మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయిన్…ఎవ‌రంటే..!

అల‌ వైకుంఠ‌పుర‌ములో సినిమా న‌టుడి భార్య కూడా మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయిన్…ఎవ‌రంటే..!

by AJAY
Ad

అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల‌లో అల వైకుంఠ పురం సినిమా కూడా ఒక‌టి. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించి అలరించింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ అసలు తండ్రిగా నటించిన నటుడి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది.

ఆయన ఎవరు….ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…. సినిమాలో అల్లు అర్జున్ అసలు తండ్రిగా నటించిన వ్యక్తి పేరు జయరామ్. రిచ్ ఫాదర్ పాత్ర‌లో జయరామ్ నటన సినిమాకు ఎంతో ప్లస్ అయింది. నిజానికి జయరామ్ 200ల‌కు పైగా సినిమాల్లో నటించారు. మొదట హీరోగా కూడా జ‌య‌రామ్ అనేక సినిమాల్లో నటించారు. జయరామ్ పంచతంత్రం సినిమాలో కూడా నటించారు.

Advertisement

Advertisement

కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో…. మా నాన్నకు హార్ట్ లో హోల్ ఉంది అంటూ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక జ‌య‌రామ్ మాత్రమే కాకుండా ఆయన సతీమణి కూడా సినిమాల్లోనే రాణిస్తున్నారు. జ‌య‌రామ్ భార్య పేరు పార్వతి తమిళ, మలయాళ సినిమాల్లో పార్వతి టాప్ హీరోయిన్ గా అలరించింది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన పార్వతి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది.

టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా జయరామ్, పార్వతి కూడా కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు ఉన్నాయి. ఇక కలిసి సినిమాలు చేసిన సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు. వీరిద్దరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Visitors Are Also Reading