Home » అఖండ సినిమాలో కనిపించిన ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా..? బాలయ్య సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

అఖండ సినిమాలో కనిపించిన ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా..? బాలయ్య సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ లు వచ్చాయి. దాంతో అఖండ సినిమాతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ పడింది. ఇక గతేడాది విడుదలైన ఈ సినిమాకు ఎంతోమంది ఫిదా అయ్యారు.

Advertisement

బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అఖండ సినిమాను హిందీలో విడుదల చేయాలని కోరడంతో రీసెంట్ గా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేశారు. ప్రస్తుతం అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో నవీన రెడ్డి అనే అమ్మాయి ముఖ్యమైన పాత్రలో నటించింది.

Advertisement

నవీన రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువ సమయం అయినా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో నవీన రెడ్డి ఎవరా అని నెటిజన్స్ వెతికే పనిలో పడ్డారు. కాబట్టి ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…. నవీన రెడ్డి అఖండ సినిమా కంటే ముందు ఎఫ్ 2 సినిమాలోను చిన్న రోల్ చేసింది. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా నటించిన వెంకీ మామ, భీష్మ, అద్భుతం సినిమాల్లోనూ ముఖ్యమైన పాత్రలలో కనిపించింది. ఇక అర్థశతాబ్దం సినిమాలో నవీన రెడ్డి హీరోయిన్ గా నటించింది.

అంతేకాకుండా నవీన రెడ్డి పక్కా హైదరాబాదీ….. ఇక్కడే చదువుకుని సినిమాలపై ఉన్న ఆసక్తితో నటనలో మెలుకువలు నేర్చుకుంది. అంతేకాకుండా మెగాస్టార్ ను ఆదర్శంగా తీసుకుని నవీన రెడ్డి సినిమాలలోకి వచ్చింది. ఆయన అంటే ఎంతో అభిమానం అని…… ఆయనకు కరోనా వచ్చినప్పుడు దేవుడికి పూజలు చేశానని నవీన రెడ్డి ఓ ఇంటర్వ్యులో వెల్లడించింది.

Also read : బాహుబలి సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

Visitors Are Also Reading