Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ధోనీ vs ABD మధ్య యుద్దం ? నువ్వా – నేనా తేల్చుకుందాం !

ధోనీ vs ABD మధ్య యుద్దం ? నువ్వా – నేనా తేల్చుకుందాం !

by Bunty
Ads

క్రికెట్ లో మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఎవరు అనగానే ఏబి డివిలియర్స్ పేరు టక్కున చెప్పేస్తారు. మెరుపు ఇన్నింగ్స్ కు పేరు ఉన్న డివిలియర్స్ సంచలన బ్యాటింగ్ తో ఆటపై ముద్ర వేశాడు. బరిలోకి దిగాడు అంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. గ్రౌండ్లో ఎటువైపు షాట్ కొడతాడో బౌలర్లు ఒక అంచనాకు కూడా రాలేరు. నిలకడగా ఆడడంతో పాటు వేగంగా ఆడగలిగే అతి కొద్ది మందిలో డివిలియర్స్ ఒకడు.

Advertisement

AB De Villiers reacts to MS Dhoni

AB De Villiers reacts to MS Dhoni

అందుకే అంత తక్కువ సమయంలోనే మినిస్టర్ 360 గా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే డివిలియర్స్ కు దీటుగా మహేంద్రసింగ్ ధోని 360 డిగ్రీస్ లో బ్యాటింగ్ చేయగలరు. అయితే ఈ డేంజరస్ బ్యాటర్లలో బెస్ట్ ఫినిషర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉందంటే ఇద్దరిలో ఎవరికి వారే చెలరేగి ఆడతారు. మ్యాచ్ చివర్లో వీరిద్దరూ క్రీజులో ఉంటే బౌలర్లకు ఆరోజు పీడకలగా మారిపోతుంది. గెలుస్తామన్న మ్యాచ్లను తమ వైపుకు తిప్పుకొని విన్నింగ్ షాట్ బాది జట్టును గెలిపిస్తారు.

Ad

Advertisement

తాజాగా డివిలియర్స్ ధోని బెస్ట్ ఫినిషర్ అంటూ ఆసక్తికర చర్చను చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కన్జర్వేషన్ లో డివిలియర్స్ మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్లినా ధోని, డివిలియర్స్ మీరు ఇద్దరిలో బెస్ట్ ఫినిచర్ ఎవరు అని చాలామంది అడుగుతున్నారని చెప్పాడు. నా దృష్టిలో ధోని బెస్ట్ ఫినిషర్ అని అంటూ సమాధానం ఇచ్చాడు. ఏబి డివిలియర్స్ ఇచ్చిన సమాధానంతో ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. డెవిలియర్స్ లాంటి దిగ్గజ బ్యాటర్ ధోని బ్యాటింగ్ కు ఫిదా అయ్యాడు అంటూ అంటే మా మహిబాయ్ ఇంకెంత గొప్పోడో కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading