Home » BIGG BOSS PROMO : నంబ‌ర్- 1 పులిహోర రాజా…యాంక‌ర్ శివ‌పై అష్షు రెడ్డి దారుణమైన కామెంట్లు..!

BIGG BOSS PROMO : నంబ‌ర్- 1 పులిహోర రాజా…యాంక‌ర్ శివ‌పై అష్షు రెడ్డి దారుణమైన కామెంట్లు..!

by AJAY
Ad

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. గ‌తంలో కేవ‌లం ప్ర‌తిరోజూ గంట మాత్ర‌మే ప్ర‌సారం అయిన బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్ గా ప్ర‌తిరోజూ 24గంట‌లు ప్ర‌సారం అవుతోంది. ఇక ప్ర‌తి సీజ‌న్ మాదిరిగానే నాగార్జున ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోమో విడుద‌లైంది.

Anchor shiva

Anchor shiva

ఈ ప్రోమోలో నాగార్జున ఇది సంబురాలు జ‌రుపుకునే స‌మ‌యం అని చెప్పాడు. బిగ్ బాస్ ఓటీటీకి అత్య‌ధిక వ్యూవ్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పారు. దాంతో కంటెస్టెంట్ లు అంతా క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపిస్తూ స్టెప్పులు వేశారు. ఇక నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడిపించారు. అలా మాట్లాడుతున్న క్ర‌మంలో యాంక‌ర్ శివ‌తో కూడా నాగార్జున మాట్లాడారు. అరియానాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో యాంక‌ర్ శివ త‌న‌కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు అంటూ చెప్పింది.

Advertisement

Advertisement

దాంతో నాగార్జున యాంక‌ర్ శివ ఎవ‌రికోసం క‌ష్ట‌ప‌డుతున్నావంటూ అడిగారు. నాకు తెలియ‌దు సార్ అంటూ శివ అమాయ‌కంగా స‌మాధానం ఇచ్చాడు. ఇక‌ యాంక‌ర్ శివ లేచిన వెంట‌నే యాంక‌ర్ శివ మామూలోడు కాద‌ని హౌస్ లోకి రాక‌ముందు రాకుమారుడు…ఇప్పుడు పెద్ద పులిహోర రాజా అంటూ అష్షురెడ్డి చెప్పుకొచ్చింది.

అత‌డు నంబ‌ర్ వ‌న్ బుల్ షిట్ గాయ్…అని పెద్ద వీయూవీ అంటూ అష్షు కామెంట్స్ చేసింది. ఇక అఖిల్ జైశ్రీకృష్ణ అని పిలుస్తూ నాగార్జున అత‌డికి మోనాల్ ను గుర్తు చేసి ఆట‌ప‌ట్టించాడు. ఇదిలా ఉంటే అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ను గుర్తు చేసుకుని బాధ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading