Home » ఇండియాకు బుద్ధి లేదు అంటున్న పాక్ క్రికెటర్..!

ఇండియాకు బుద్ధి లేదు అంటున్న పాక్ క్రికెటర్..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ మధ్య రైవలరి అనేది ఎప్పటి నుండో వస్తూనే ఉంది. ఇక రెండు దేశాలలో ప్రసిద్ధమైన క్రికెట్ మ్యాచ్ లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఆటగాళ్లు.. మాజీ ఆటగాళ్లు ఎక్కువగా ఇండియాపై ఇష్టం వచ్చిన కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆకీబ్ జావెద్ కూడా అలాంటి కామెంట్స్ ఇండియాపై చేసాడు.
తాజాగా ఆకీబ్ జావెద్ మాట్లాడుతూ.. క్రికెట్ లో ఎప్పుడైనా మ్యాచ్ లేదా సిరీస్ అనేది గెలవాలంటే బ్యాటర్ల కంటే బౌలర్లే కీలక పాత్ర పోషిస్తారు. అందులోనూ ఫాస్ట్ బౌలర్లు జట్టుకు చాలా ముఖ్యం. కానీ ఇండియా జట్టు మాత్రం వారు యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. అతను గంటకు 150 కీ.మీ వేగంతో బంతులు వేయగలడు. అంత వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ ను ఎదుర్కోవాలంటే ఏ బ్యాటర్ అయిన భయపడుతాడు.
కానీ ఇండియా యాజమాన్యం మాత్రం కేవలం రెండు మూడు మ్యాచ్ లలో అవకాశం ఇచ్చి అతడిని పక్కకు పెట్టింది. ఇది బుద్ధి లేని పని. ఎందుకంటే ఆసియా కప్ తర్వాత టీ 20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. కాబట్టి మాలిక్ ఫామ్ లోకి వచ్చేవారు అతనికి అవకాశాలు స్తే బాగుండు. అతను ఆస్ట్రేలియా ఫాస్ట్ పిచ్ లపై బాగా రాణించగలడు. కానీ బీసీసీఐ అలా చెయ్యలేదు అని ఆకీబ్ జావెద్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading