Home » సీఎంను ఓడించిన స్వీప‌ర్ కుమారుడు..!

సీఎంను ఓడించిన స్వీప‌ర్ కుమారుడు..!

by Anji
Ad

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఆప్ దూకుడు ముందు సీఎం, మాజీ సీఎంలు, రాజ‌కీయ దిగ్గ‌జాలు సైతం తోక‌ముడ‌వాల్సి వ‌చ్చింది. సీఎం చ‌న్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోని, పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమ‌ణి అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్బీర్ బాద‌ల్‌, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవ‌లందించిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్‌, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్‌కు కూడా ఓట‌మి త‌ప్ప‌లేదు. అయితే సిట్టింగ్ సీఎం చ‌న్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓట‌మి పాల‌వ్వ‌డం చ‌ర్చ‌గా మారింది. ముఖ్యంగా బ‌దౌర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆప్ అభ్య‌ర్థి లాభ్‌సింగ్ సీఎం చ‌న్నీపై గ్రాండ్ విక్ట‌రీ కొట్టేసాడు. దీంతో లాభ్ సింగ్ గురించే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

Advertisement


సీఎం చ‌ర‌ణ్ జీత్ చ‌న్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవ‌రు..? అని నెటిజ‌న్లు వెతుకుతూ ఉన్నారు. లాబ్ సింగ్ విష‌యానికి వ‌స్తే ఓ సాధార‌ణ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. తండ్రి డ్రైవ‌ర్‌, త‌ల్లి స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. 1987లో జ‌న్మించిన లాభ్ సింగ్ ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్నాడు. ఇక మొబైల్ రిపేర్ షాపు న‌డుపుతూ మొబై్ రిపేర్ల‌తో జీవ‌నం గ‌డిపే లాభ్ సింగ్.. 2013 ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. బ‌దౌర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని మొత్తం గ్రామాల‌ను చుట్టేశాడు. స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసాడు. అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాడు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఆప్ అభ్య‌ర్థి పిర్‌మ‌ల్‌సింగ్ గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆప్ టికెట్‌ను లాభ్‌సింగ్‌కు వ‌చ్చింది. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న లాభ్ సింగ్ నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిస్తాయిలో ప‌ట్టుఉండ‌డంతో ఆ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం సీఎంను ఓడించి సంచ‌ల‌నంగా మారాడు.

Advertisement

Visitors Are Also Reading