Home » కరణ్ జోహార్ పరువు తీసిన ఆమిర్ ఖాన్..!

కరణ్ జోహార్ పరువు తీసిన ఆమిర్ ఖాన్..!

by Azhar
Ad

కరణ్ జోహార్ బాలీవుడ్ లో పెద్ద సెలబ్రెటీ. అయితే ఆయన హోస్ట్ గా నిర్వహించే కాఫీ విత్ కరణ్ షో అనేది దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందులో కరణ్ జోహార్ వచ్చిన గెస్ట్స్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ విషయాలు.. అలాగే వారి ఎఫైర్స్ గురించి ప్రశ్నిస్తుంటాడు. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ షోను బాగా ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని సమయాల్లో ఈ షో అనేది విమర్శలకు కూడా గురవుతుంది.

Advertisement

అయితే ఈ మధ్యే తాజాగా ఈ షో యొక్క కొత్త సీజన్ అనేది ప్రారంభించగా.. ఇప్పటికే కొంత మంది సెలబ్రెటీలు ఈ షోకు వచ్చారు. ఇక తాజాగా ఆమిర్ ఖాన్ కూడా స్ షోకు వచ్చాడు. తాను నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా అనేది విడుదల సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్ కోసం ఈ షోకు కరీనా కపూర్ తో కలిసి వచ్చాడు.

Advertisement

ఇక షో మధ్యలో కరణ్ తన అలవాటు ప్రకారమే కరీనాను పిల్లలు పుట్టిన తర్వాతి లైంగిక జీవితం గురించి ప్రశ్నించగా… కరీనా నీకు తెలియదా అంటూ పేర్కొంది. దానికి ఈ కరణ్.. షో మా అమ్మ చూస్తుంది. కాబట్టి నా లైంగిక జీవితం గురించి మాట్లాడకపోతే మంచిది అని అనగానే. ఆమిర్ ఖాన్… కానీ వేరే వారి లైంగిక జీవితం గురించి మాట్లాడితే మీ అమ్మ ఏం అనుకోదు కదా అంటూ ఎద్దేవాగా అన్నాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ..కరణ్ జోహార్ పరువు ఆమిర్ ఖాన్ మళ్ళీ తీసేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

Visitors Are Also Reading