Home » రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?

రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?

by Azhar
Published: Last Updated on
భారత జట్టులోకి 37 ఏళ్ళ వయస్సులో రీ ఎంట్రీ ఇచ్చాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ 2022 ;ప్ బెంగళూర్ జట్టు తరపున అదరగొట్టిన కార్తీక్… ఆ పెరఫార్మెన్స్ కారణంగానే ఇండియా జట్టులోకి రాగలిగాడు. అయితే మళ్ళీ ఇండియా జట్టులో వచ్చిన అవకాశాని బాగా ఉపయోగించుకున్న కార్తీక్.. ఇప్పుడు జట్టుకు బెస్ట్ ఫినిషర్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ కోసం ఎంపికైన కార్తీక్.. మొదటి టీ20 మ్యాచ్ లోనే అదరగొట్టాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి 19 బంతుల్లో 41 పరుగులు చేసాడు. అందువల్లే జట్టు 190 పరుగుల మార్క్ కు చేరింది.
కానీ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి అర్ధశతకం అనేది చేసిన కెప్టెన్ రోహిత్ శర్మది గొప్ప ఇన్నింగ్స్ అని చాలా మంది అన్నారు. కానీ తాజాగా భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాత్రం రోహిత్ కంటే దినేష్ ఇన్నింగ్స్ బెస్ట్ అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఆకాష్ మాట్లాడుతూ.. మొదటి టీ20 లో దినేష్ కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధం శతకం చేసాడు. అయినా కూడా దినేష్ కార్తీక్ ఆడిన 41 పరుగుల ఇన్నింగ్స్ బెస్ట్. ఎందుకంటే క్రికెట్ లోని లేఖల్లో కొన్నిసార్లు చాలా విషయాలు అనేవి ఉంటాయి.
రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. కానీ అతను ఔట్ అయినా సమయంలో జట్టు చాలా కష్టాల్లో ఉంది. దినేష్ బేటింగ్ కు వచ్చిన సమయంలో కూడా పరిస్థితి అనేది అలాగే ఉంది. కానీ కార్తీక్ వచ్చి జట్టును ఆదుకున్నాడు. అతను ఇప్పుడు బెస్ట్ ఫినిషర్. అతనిలో ఇంకా చాలా క్రికెట్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు క్రికెట్ లో దినేష్ 6వ స్థానానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు అనేది తెచ్చాడు. దానిని చాలా స్పెషల్ గా మార్చాడు. ఎలా అంటే దినేష్ కూడా ఓ స్పెషల్ ప్లేయర్ కాబట్టి అని చోప్రా పేర్కొన్నాడు. ఇక దినేష్ ఇలాగే ఆడితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ యొక్క భారత జట్టులో ఉండటం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.
Visitors Are Also Reading