Home » విచిత్రం:పందులకు కూడా ఆధార్ కార్డు.. రాబోతుందా..?

విచిత్రం:పందులకు కూడా ఆధార్ కార్డు.. రాబోతుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆధార్ కార్డు పెట్టి అన్నింటా మనిషిని నిస్సహాయున్ని చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జంతువులను సైతం వదలడం లేదు. చివరకు పందులను కూడా వదలడంలేదు. అయితే అసలు విషయానికి వస్తే.. మీరు ఎక్కడో అక్కడ ఒక ప్రత్యేకమైన ట్యాగ్ కలిగిన ఆవులు, గేదెలను ఇంతకుముందు వరకు చూసే ఉంటారు. పశువుల చెవులకు ఉండే ఈ ట్యాగ్ ని వాటి ఆధార్ కార్డు అని కూడా అంటారు. ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ జాతీయ వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఒక భాగం. ఈ కార్యక్రమం కింద జంతువులకు ఎఫ్ఎమ్ డి, బృసెల్లోసిస్ కు వ్యతిరేకంగా టీకాలు వేస్తారు. దీనికి ముందు టీకా సమాచారాన్ని అప్డేట్ చేయడానికి గుర్తింపు కోసం జంతువుల చెవులకు ట్యాగ్ అమరుస్తారు. ఈ ట్యాగ్ ద్వారా జంతువులకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా ఇస్తారు. దీని ద్వారా టీకా సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. జంతువుల నమోదు సమాచారం నెట్ వర్క్ , జంతు ఉత్పాదకత, ఆరోగ్య ప్లాట్ ఫామ్ లో అప్ లోడ్ అవుతోంది. 14.62 కోట్ల జంతువులను ట్యాగ్ చేయడమే లక్ష్యంగా ప్లాస్టిక్ ట్యాగ్ ను రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఆవులు, గేదెలు,పందులు, మేకల చెవులకు ట్యాగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ జంతువుల చెవులలో ఉండే ట్యాగ్ ప్లాస్టిక్ తో తయారై ఉంటుంది. ఇందులో 12 అంకెల నెంబరు ఉంటుంది. ఇలా మొత్తానికి జంతువుకు ఆధార్ పెట్టి కొత్త ట్రెండ్ కి ప్రభుత్వం నడుం కట్టిందని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

అమ్మో ఆకాశం నుంచి ఇనుప గోలీలు పడ్డాయట.. ఎక్కడో తెలుసా..!!

పాన్ ఇండియా లెవెల్ లో “సర్కారు వారి పాట” రాబోతుందా.. ఇక ఆ సినిమాలు పనికి రావట..!!

 

 

Visitors Are Also Reading