కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట రికార్డును సృష్టించింది. ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ప్రకటించిన ఈ జంటకు ఓ పండంటి బిడ్డ పుట్టింది. కోజీవుడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్ర చికిత్స ద్వారా శిశువు పుట్టినట్టు ఈ జంటలో ఒకరైన జియా పావల్ వెల్లడించారు. ప్రసవం తరువాత శిశువు, జహాద్ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు. జహాద్ తన బిడ్డకి పాలిచ్చే వీలు లేకపోవడంతో.. ఆసుపత్రి పాల బ్యాంకు ద్వారా వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసారు. ఈ జంటను ఫోన్ ద్వారా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఉచితవైద్యం అందించాలని వైద్య కళాశాలకు ఆదేశాలు జారీ చేసారు.
Advertisement
దేశ చరిత్రలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్ జెండర్ జంటగా జియా, జహాద్ నిలిచారు. శిశువు లింగ వెల్లడికి ఈ జంట తిరస్కరించింది. తన జీవిత భాగస్వామి జహాద్ ఎనిమిది నెలల గర్భంతో ఉన్నట్టు జియా పావల్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన విషయం విధితమే. కేరళకు చెందిన జహాద్, జియా ఇద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జహాద్ ఓ ప్రయివేటు కంపెనీలో అకౌంటెంట్ కాగా.. జియా పిల్లలకు డ్యాన్స్ నేర్పించే వాడు. పుట్టుకతో అమ్మాయి అయిన జహాద్ లింగమార్పిడి చికిత్స ద్వారా అబ్బాయిగా మారాలనుకుంది.
Advertisement
మగవాడు అయిన జియా తాను అమ్మాాయిగా మారాలని కోరుకున్నాడు. వీరి కోరిక మేరకు డాక్టర్లు హార్మోన్ థెరపీని ప్రారంభించారు. చికిత్స మధ్యలో ఉండగానే.. ఓ చిక్కు వచ్చి పడింది. ట్రీట్ మెంట్ ప్రారంభించిన డాక్టర్లకు ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. జహాద్ అప్పటికే గర్భవతి అని గుర్తించారు. దీంతో తర్జనభర్జన మొదలైంది. జహాద్ ని అబ్బాయిగా మార్చే చికిత్సను మధ్యలోనే ఆపేసారు. అయితే దశలవారిగా కొనసాగే చికిత్సలో భాగంగా అప్పటికే ఆమె వక్షోజాలను డాక్టర్లు తొలగించారు. మిగిలిన ప్రక్రియ పూర్తి కాలేదు. జహాద్ సాధారణ కాన్పుతోనే బిడ్డకి జన్మనిచ్చిన తరువాత హార్మోన్ థెరపీ కొనసాగించాలని నిర్ణయించారు.
Also Read : అతనొక్కడే సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?