Home » భార‌త్‌లోకి వ‌చ్చిన మూడేళ్ల పాకిస్తాన్ బాలుడు.. పాక్ సైన్యానికి అప్ప‌గించిన భార‌త ఆర్మీ

భార‌త్‌లోకి వ‌చ్చిన మూడేళ్ల పాకిస్తాన్ బాలుడు.. పాక్ సైన్యానికి అప్ప‌గించిన భార‌త ఆర్మీ

by Anji
Ad

పాకిస్తాన్‌కు చెందిన మూడేండ్ల బాలుడు అనుకోకుండా అక‌స్మాత్తుగా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దును దాటి భార‌త్‌లోకి ప్ర‌వేశించాడు. పాపా.. పాపా.. అని పిలుస్తూ బిగ్గ‌ర‌గా ఏడుస్తుండ‌డాన్ని భార‌త్ జ‌వాన్లు గ‌మ‌నించారు. వెంట‌నే ఆ బాలుడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకుని పాక్ సైన్యానికి అప్ప‌గించిన‌ట్టు భార‌త ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఫిరోజ్‌పూర్ సెక్టార్ అంత‌ర్జాతీయ కంచె వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.


సైనికులు ఆ బాలుడిని వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అత‌ను ఏమి చెప్ప‌లేక‌పోయాడు. బాలుడిని వారి ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఫీల్డ్ క‌మాండ్ వెంట‌నే పాకిస్తాన్ రేంజ‌ర్స్‌ను సంప్రదించారు. పాక్ రేంజ‌ర్ స‌మ‌క్షంలో బాలుడిని అత‌ని తండ్రికి అప్ప‌గించారు. పంజాబ్‌లోని అంతర్జాతీయ స‌రిహ‌ద్దుకి అనుకోకుండా వ‌చ్చిన మూడేళ్ల పాకిస్తానీ బాలున్ని బీఎస్ఎఫ్ జ‌వాన్లు అత‌నికుటుంబానికి అప్ప‌గించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

భార‌త సైనికులు తొలుత ఆ బాలుడిని వివ‌రాలు అడ‌గ్గా ఏమి చెప్ప‌లేక‌పోయాడు. బాలుడిని వారి ద‌గ్గ‌రే కొద్దిసేపు ఉంచుకుని.. ఆ త‌రువాత వివ‌రాల‌ను చెప్ప‌డంతో పాకిస్తాన్ రేంజ‌ర్స్‌ను సంప్ర‌దించారు బీఎస్ఎఫ్ ఫీల్డ్ క‌మాండ్‌. ఈ విష‌యం వారికి చెప్పి ఆ బాలుడిని మాన‌వ‌తా దృక్ప‌థంతో అప్ప‌గించిన‌ట్టు భార‌త అధికారులు పేర్కొన్నారు. ప్ర‌ధానంగా తెలిసి, తెలియ‌కుండా స‌రిహ‌ద్దు దాటే వారి ప‌ట్ల ఆర్మీ మాన‌వీయ కోణంలో వ్య‌వ‌హ‌రిస్తోంది.

Also Read : 

రెక్కీ 360 టీజ‌ర్ మీరు చూశారా..? ఎలా ఉందంటే..?

కెరీర్ పీక్స్ లో ఉండ‌గా 30ఏళ్లలోనే క‌న్నుమూసిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Visitors Are Also Reading