Home » గుండెపోటును ముందే గుర్తించే స్మార్ట్ వాచ్..నాసా టెక్నాలజీ..ఫీచర్స్ అదుర్స్..!

గుండెపోటును ముందే గుర్తించే స్మార్ట్ వాచ్..నాసా టెక్నాలజీ..ఫీచర్స్ అదుర్స్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలం నుంచి అనేక రకాల ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో చాలా వాచ్ లలో హెల్త్ ట్రాకింగ్, ఫిట్నెస్ ఇతరత్రా మెరుగైన ఆప్షన్స్ ఉంటున్నాయి. అలాంటిదే సరికొత్త ఫీచర్స్ తో ఒక కొత్త వాచ్ విడుదలైంది. ఈ వాచ్ గుండెపోటును ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుందట. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మరియు నాసా టెక్నాలజీ ఈ యొక్క వాచ్ పనిచేస్తుందని వివరాలు తెలియజేసింది. ఇటీవల అమెరికాలోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2023లో ఈ వాచ్ ను లాంచ్ చేసింది.

Advertisement

Also Read;Balakrishna: వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బాలకృష్ణ డ్రింక్ చేశారా..?

Advertisement

ఈ వాచ్ ధరించిన వ్యక్తులు ఎలాంటి అలసటకు గురైన ముందుగానే అలెర్ట్ చేస్తుంది. అంతేకాకుండా తగు సూచనలు కూడా ఇస్తుందట. ఈ సిటిజన్ బ్రాండ్ వాచ్ లో “CZ smart youQ” అని అప్లికేషన్ తో ఇందులో కొత్త ఫీచర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా ప్రతిరోజు అలర్ట్ మానిటర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది శరీరంలో జరిగే ప్రతి మార్పును కనిపెడుతూ ఉంటుంది.ఈ వాచ్ ను నాసా టెక్నాలజీ తో తయారు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్, నాసా కలిసి ఈ కొత్త టెక్నాలజీ స్మార్ట్ వాచ్ లను తయారుచేసినట్టు సిటిజన్ వాచ్ అమెరికా ప్రెసిడెంట్ జఫ్రి కోహెన్ తెలియజేశారు.

అయితే గుండె సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హార్ట్ రేట్ ను చెక్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుందట . ముఖ్యంగా గుండెపోటు రావడానికి ముందు ఈ వాచ్ వ్యక్తిని అలెర్ట్ చేస్తుందని అంటున్నారు . దీని ధర 350 డాలర్లు. అంటే 31 వేల రూపాయల అన్నమాట. హెల్త్ అలర్ట్ కావాలనుకున్న వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read;ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం..కుటుంబం కోసం క్రికెట్ కి వీడ్కోలు..!

Visitors Are Also Reading