Home » లైకుల కోసం ఇంత‌టి నీచమా… ప‌సిపిల్లాడితోనే ఆటలు..!

లైకుల కోసం ఇంత‌టి నీచమా… ప‌సిపిల్లాడితోనే ఆటలు..!

by Anji
Ad

ప్ర‌పంచం మొత్తం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో, సామాజిక మాద్య‌మాల్లో మునిగి తేలుతున్నారు. ప‌క్కింటి వారిని ప‌లుక‌రించాన్నా వాట్సాప్ మెసెజ్ ఒకటి విసిరేస్తూ ఉన్నారు. మ‌రీ అంత బిజీగా ఎలా మారిపోయారో అర్థం అవ్వ‌ట్లేదు. ఏమి చేసినా.. సోష‌ల్ మీడియాలో చెప్పి చేస్తున్నారు. లైక్స్ కోసం, కామెంట్లు, వ్యూస్ కోసం వింత‌గా.. భ‌యంక‌రంగా వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒక‌టి సామాజిక మాద్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Viral Video: బుద్ధుందా! లైకుల కోసం ఇంతటి నీచానికి ఒడికడతావా? పసిపిల్లాడితోనా ఆటలు..

Advertisement

Advertisement

ఈ వీడియోలో ఓ బుడ‌త‌డు విష పూరిత‌మైన పాముతో ఆడుకోవ‌డం క‌నిపిస్తోంది. అయితే అది ప్రాణాలు తీసే జంతువు అని తెలియ‌ని ముక్కుప‌చ్చ‌లార‌ని ప‌సిబాలుడు న‌వ్వుల‌లు చిందిస్తూ ఆట‌లాడుకుంటున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం వీడియో తీసిన వారిపై మండిప‌డుతున్నారు. లైకుల కోసం ఇంత‌టి నీచానికి ఒడిక‌డ‌తారా..? పిల్లాడి ప్రాణాల‌ను ప‌నంగా పెడ‌తారా..? అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం నెట్టింట్లో మాత్రం వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారు అంద‌రూ విస్మ‌యం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

Visitors Are Also Reading