Home » ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డు నందమూరి హీరోలకే సాధ్యమైందా..?

ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డు నందమూరి హీరోలకే సాధ్యమైందా..?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి దాదాపు ఏడు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది. నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ తొలితరం హీరో కాగా.. రెండో తరం హీరోలుగా హరికృష్ణ, బాలకృష్ణ రాణించగా.. నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈతరం స్టార్ హీరోలలో ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో చాలా మంది డ్యుయల్ రోల్ చేసిన హీరోలను చూశాం.

Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంలో డ్యుయెల్ రోల్ లో నటించాడు. చాలా మంది ద్విపాత్రాభినయంలో నటించారు. కానీ నందమూరి హీరోలైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా ఈతరం హీరోలలో ఏ హీరో నటించని విధంగా ఏకంగా మూడు పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కే.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జైలవకుశ చిత్రంలో మూడు పాత్రల్లో నటించాడు. ఇందులో ప్రధానంగా జై, లవ, కుశుడి పాత్రల్లో నటించి వీరవిహారమే చేశాడు. ఈ చిత్రం కేవలం ఎన్టీఆర్ నట విశ్వరూపం వల్లనే హిట్ అయిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు చాలా సినిమాలలో ద్వి పాత్రల్లో, త్రి పాత్రల్లో, నాలుగు పాత్రల్లో కూడా నటించి అభిమానులను మెప్పించాడు. 

Advertisement

Also Read :  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోలకు వారి భార్యలకు మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..?

Manam News

ముఖ్యంగా దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి. మరోవైపు దశవతారం చిత్రంలో అయితే కమల్ హాసన్ ఏకంగా 10 పాత్రల్లో నటించి అందరి మన్ననలు పొందాడు. 1966లో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా 9 పాత్రల్లో నటించి అప్పట్లో రికార్డునే సృష్టించాడు. ఎన్టీఆర్ తరువాత కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి మూడు పాత్రల్లో నటించారు. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలు పోషించాడు. ఇప్పటి హీరోలలో మాత్రం ఎవ్వరూ కూడా త్రిబుల్ రోల్స్ చేయలేదు. ఎన్టీఆర్ జై లవకుశ, కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో త్రిబుల్ రోల్ చేశాడు. మొత్తానికి నందమూరి కుటుంబం నుంచే ముగ్గురు హీరోలు మూడు పాత్రల్లో నటించి అరుదైన రికార్డునే సృష్టించారు. మొత్తానికి ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డులను నందమూరి హీరోలకు సొంతమైందనే చెప్పవచ్చు. 

Also Read :  ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ఎంత నిలబెట్టిందో తెలుసా ? 

Visitors Are Also Reading