టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన బ్యాటింగ్, కెప్టెన్సీతో భారతీయ జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. అంతేకాదు.. రూ.100 కోట్లకు పైగా భారతీయుల కలను నెరవేర్చిన హీరో కూడా ధోనీనే కావడం విశేషం. 2007లో టీ 20 ప్రపంచ కప్ తో సహా 2011 వన్డే ప్రపంచ కప్ ను భారత జట్టుకు అందించాడు. 28 ఏళ్ల తరువాత వన్డే ప్రపంచ కప్ అందించి భారతీయులు ఉప్పొంగేలా చేసాడు. 2011 ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా సంబురాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
Also Read : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఆ ప్లేయర్ ఔట్..!
Advertisement
ఈ నేపథ్యంలో ధోనిని గౌరవించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో ఎం.ఎస్. ధోనీ సిక్స్ కొట్టి టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ ను అందించాడు. ఆ అపురూప క్షణాలను ఏ భారతీయుడు కూడా ఇప్పటికీ మరువలేరు. ప్రపంచ కప్ ఫైనల్ కి వేదిక అయిన ముంబై వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ధోనీ ఫినిషింగ్ సిక్స్ కొట్టగా.. బంతి ఏ సీటులో పడింతో ఆ సీటుకు ధోనీ పేరు పెట్టనున్నట్టు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు. ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్ లో సీటుకు ధోనీ పేరు పెట్టనున్నారు.
Advertisement
Also Read : పుస్తకాలు అంటే పడి చచ్చే పవన్ కళ్యాణ్.. ఎంతవరకు చదివారో తెలుసా..?
స్టాండ్స్ లోని సీటుకు పేరు పెట్టే కార్యక్రమం కోసం వాంఖడే స్టేడియానికి రావాల్సిందిగా ఎం.ఎస్.ధోనిని కోరినట్టు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే చెప్పారు. మహిని మెమొంటోతో సత్కరిస్తాం అని తెలిపారు. వాంఖడే స్టేడియంలో స్టాండ్స్ లకు దిగ్గజ క్రికెటర్లు ఇప్పటికే సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విజయ్ మర్చంట్ పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. స్టేడియం గేట్లకు పాలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్ పేర్లున్నాయి. స్టాండ్స్ లోని సీట్లకు పేరు పెట్టడం మాత్రం ఇది ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాకు రిటైర్డ్ ప్రకటించినా.. ఐపీఎల్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ కొనసాగుతున్నాడు. 16వ సీజన్ చివరిది కానున్నట్టు తెలుస్తోంది.
Also Read : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?