Home » Chankya Niti: ఈ ఐదు విష‌యాల‌ను అర్థం చేసుకున్న వ్య‌క్తి ఎంత‌టి క‌ష్టాన్ని అయినా ఎదుర్కొవ‌చ్చు..!

Chankya Niti: ఈ ఐదు విష‌యాల‌ను అర్థం చేసుకున్న వ్య‌క్తి ఎంత‌టి క‌ష్టాన్ని అయినా ఎదుర్కొవ‌చ్చు..!

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుడు చెప్పే త‌న మాటల్లో జీవిత ప‌ర‌మార్థం దాడి ఉంది. త‌న అనుభ‌వాల ద్వారా ఏదైతే సాధించారో.. దానిని త‌న గ్రంథాల ద్వారా ప్ర‌జ‌ల‌కందించారు. జీవితంలో క‌ష్ట‌, న‌ష్టాల‌ను అధిగ‌మించ‌డం కోసం ఐదు సూత్రాల‌ను అర్థం చేసుకోవాల‌ని చాణ‌క్యుడు చెప్పారు. ఆ ఐదు విష‌యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: If you follow these 4 things said by Chanukya .. there will  never be a deficit of money in that person's life .. | Chanakya Niti: By  keeping these 4

Advertisement

దేవ‌త‌లు, సాధువులు, త‌ల్లిదండ్రులు చాలా అరుదుగా సంతోషిస్తారు. కానీ ద‌గ్గ‌రి, దూర‌పు బంధువులు గౌర‌వించ‌బ‌డిన‌ప్పుడు సంతోషిస్తారు. ఇక పండితులు ఆధ్యాత్మిక సందేశానికి అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు ఆనందాన్ని పొందుతారు.

మ‌నిషి చేసే ప‌నులు అత‌నిడి ఎప్ప‌టికీ వ‌ద‌ల‌వ‌ని ఆచార్య చెప్పారు. వేల ఆవుల మ‌ధ్య ఆవుదూడ త‌న త‌ల్లిని అస‌రించిన‌ట్టు.. అదేవిధంగా క‌ర్మ‌కూడా ఆ వ్య‌క్తిని అనుస‌రిస్తుంది. మీ స‌త్కార్యాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించారు.

Advertisement

నాలుగు వేదాలు, ఇత‌ర అన్ని మ‌త గ్రంథాలు చ‌దివిన వ్య‌క్తి త‌న సొంత ఆత్మ‌ను గ్ర‌హించ‌క‌పోతే.. అత‌ని జ్ఞానం అంతా వ్య‌ర్థ‌మే. అలాంటి వారిని గ‌రిట‌తో అభివ‌ర్ణించారు ఆచార్య చాణ‌క్యుడు. ఎందుకంటే.. గ‌రిట‌తో ర‌క‌ర‌కాల వంట‌లు చేసినా.. దేనినీ రుచి చూడ‌లేర‌ని భావం.

విజ‌యాన్ని రుచి చూడాల‌నుకుంటే.. వైఫ‌ల్య భ‌యాన్ని తొల‌గించ‌డం ముఖ్యం. మీ ల‌క్ష్యాన్ని గ‌మ‌నించండి. మీ విజ‌యం ప్ర‌యాణంలో వైఫ‌ల్యాన్ని పాఠంగా తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి. ప్ర‌య‌త్నాలు చేయ‌డం ద్వారా.. మీరు మీ ల‌క్ష్యాన్ని సాధించ‌డంలో క‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు.

ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క‌రూ సంతృప్తిగా జీవించ‌డం నేర్చుకోవాల‌ని ఆచార్య చాణ‌క్యుడు పేర్కొన్నారు. ఎందుకంటే అన్ని ఆనందాల‌ను పొందిన వ్య‌క్తి ఈలోకంలోనే లేడు. అంద‌రూ దేవుడు నియంత్ర‌ణ‌లో ఉన్నార‌ని ఆయ‌న అభిప్రాయం.

Visitors Are Also Reading