సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అప్పటివరకు కనీ వినీ ఎరుగని విషయాలు మన కళ్ల ముందే ఆవిష్కరించబడుతున్నాయి. దేశంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి పలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరేళ్ల కిందట భర్తను కోల్పోయిన ఓ మహిళకు గ్రామస్తులు దగ్గర ఉండి మరీ ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. అప్పటికే ఆ మహిళకు పది మంది పిల్లలుండటం గమనార్హం. ఇలాంటి అరుదైన వివాహం ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
Also Read : గీతాంజలి హీరోయిన్ జీవితంలో దాగి ఉన్న చీకటి కోణం గురించి మీకు తెలుసా ?
Advertisement
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో 10 మంది పిల్లలకు అయిన ఓ వితంతువు తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని ఊరి పెద్దలు దగ్గర ఉండి మరీ జరిపించారు. అంతేకాదు.. గ్రామానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ ఈ జంటకు ఉద్యోగాలుండటానికి వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేసి 10 మంది పిల్లలకు అండగా నిలిచాడు. ఆ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బహల్ గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ (42) మొదటి భర్త ఆరేళ్ల కిందట చనిపోయాడు. ఇక అప్పటికే సోనీ శర్మకు పది మంది పిల్లలు న్నారు. భర్త చనిపోయిన కొంతకాలం తర్వాత అదే గ్రామానికి చెందిన బాలేంద(40) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు ఏడాది క్రితం ఆ గ్రామం నుంచి లేచిపోయారు.
Advertisement
Also Read : స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తారట..!
అప్పుడప్పుడు సోనీ శర్మ తన గ్రామానికి వచ్చిపోతూ ఉండేది.. ఆ సమయంలో గ్రామస్థులు పిల్లల క్షేమ సమాచారం అడిగి తెలుసుకునేవారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు సోనీ శర్మ, బాలేంద్రకు వివాహం జరిపించి వారికి కొత్త జీవితం ప్రసాదించాలని భావించారు.బాలేంద్ర, సోనీ శర్మకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్న గ్రామస్థులు వారిని తమ ఊరికి పిలిపించి పంచాయితీ జరిపించారు. గ్రామానికి చెందిన పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ ఈ వ్యవహారాన్ని అంతా దగ్గరుండి మరీ చూసుకున్నారు. వీరిద్దరిని ఒప్పించి గ్రామంలో ఉన్న శివాలయంలో పెళ్లి జరిపించారు. వీరి పెళ్లికి గ్రామస్తులే తమ ఖర్చుతో విందు ఏర్పాటు చేశారు. సోనీ శర్మ పది మంది పిల్లలకు ఇప్పుడు తండ్రి ఉన్నాడని.. వారికి ఎలాటి ఇబ్బంది ఉండదని జై ప్రకాశ్ షాహి అన్నారు. అంతేకాదు.. బాలేంద్ర, సోనీ శర్మకు తమ కాలేజ్ లో ఉద్యోగాలు ఇప్పించడమే కాదు.. వారు నివసించేందుకు ఉచితంగా వసతీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Also Read : Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…