Home » తాను చనిపోతానని ముందే తెలిసి.. భార్య కోసం ఏం చేశాడో తెలిస్తే పొగడకుండా ఉండరు..!

తాను చనిపోతానని ముందే తెలిసి.. భార్య కోసం ఏం చేశాడో తెలిస్తే పొగడకుండా ఉండరు..!

by Anji
Ad

సాధరణంగా ఒక మనిషి ఎప్పుడు, ఎలా జీవిస్తాడో, ఎలా మరణిస్తాడో ఎవ్వరూ పసిగట్టలేరు. పుట్టిన వాడు చావకుండా ఉండడు. కానీ ఎవరికైనా తాను చనిపోయే రోజు తెలిస్తే ఆ మనిషి పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ రోజుల సమయం ఉంటే ఆ బాధ వర్ణణాతీతం. ఆస్ట్రేలియాలో చనిపోయిన తెలుగు యువకుడు హర్షవర్థన్ పరిస్థితి కూడా ఇలాంటిదే. తనకు కావాల్సిన మనషులకు, తనను నమ్ముకొని బతికే వారికి జవాబుదారిగా ఉండాలని ఆలోచించాడు. అప్పటివరకు తనమీద ఆధారపడిన వారికి తన మరణంతో ఆధారం లేకుండా పోకూడదనే భయంతో అన్ని ఏర్పాట్లు చేసిన తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడు. ఆస్ట్రేలియాతో వైద్యుడిగా చేసే హర్షవర్ధన్ క్యాన్సర్ కారణంగా ఇటీవలే మరణించారు. 

Also Read :  మ‌జ్ను సినిమాలో క‌నిపించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా..? ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఫుల్ పాపుల‌ర్..!

Advertisement

తాను చనిపోతాననే విషయం రెండేళ్ల కిందటే తెలిసింది. కాకపోతే పెళ్లి జరిగిన తరువాత తెలిసింది. భార్యకు వీసా వచ్చిన తరువాత ఆస్ట్రేలియా తీసుకెళ్దామని.. భార్యకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కలలు కన్నాడు. కానీ క్యాన్సర్ అతడి కలలను చిదిమేసింది. హర్ష నువ్వు త్వరలోనే చనిపోతావు, ఏవైనా పనులుంటే వెంటనే చూసేసుకో అని యముడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చేశాడు. మార్చి 24న హర్ష మరణించాడు. కానీ కొద్ది రోజుల్లో చనిపోతున్నానని జీవితాన్ని ఎంజాయ్ చేయలేదు. తనను నమ్ముకొని ఓ ఇంటి నుంచి తన ఇంటికి వచ్చిన అమ్మాయి కోసం ఆలోచించాడు. తన వల్ల ఓ అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందా అని కుమిలిపోయాడు. తను చనిపోతున్నా అని తెలిసి భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇవ్వడమే కాదు.. ఆమెకు భరణానికి మించి ఇచ్చాడు. తాను ఎలాగు అనుభవించలేను. 

Advertisement

Also Read :   ప్రభాస్ వల్ల రాజమౌళికి తిట్లు.. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?

కానీ తనను నమ్ముకొని వచ్చిన భార్య జీవితాన్ని నిలబెడుతుంది కదా అని సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం ఆమెకు కేటాయించాడు. ఆ డబ్బుతో ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసాడు. తాను లేకపోయినా ధైర్యంగా జీవించేలా ఓ ఆర్థిక భరోసా ఇచ్చాడు. భార్యకు మాత్రమే కాదు.. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా జీవితాంతం లోటు లేకుండా జీవించే విధంగా  ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా ఎవరైనా చనిపోతున్నారంటే  లోలోపల కుమిలిపోతారు. వారు డిప్రెషన్ కి గురై తన వాళ్లను, ప్రపంచాన్ని మరిచిపోతారు. హర్ష మాత్రం తన జీవితం గురించి ఆలోచించడం మానేసి తన వాళ్ల జీవితం గురించి ఆలోచించాడు. కొద్ది రోజుల్లో తాను ఎలా బతకాలి అనే దాని కంటే తనను నమ్ముకొని వచ్చిన భార్య, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా బతకాలో అని ఆలోచించాడు. ఇంత మంచి మనిషికి చావు త్వరగా వచ్చింది. చనిపోతున్నా అని తెలిసి కూడా హర్ష తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమె జీవితాన్ని సెటిల్ చేసి కొత్త జీవితాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read :   హీరో గోపీచంద్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమాలు.

Visitors Are Also Reading