Home » ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి.. ఎక్కడో తెలుసా ?

ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి.. ఎక్కడో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా  ప్రేమకు సాటి ఏది ఉండదు అని మనం వింటుంటాం. డబ్బుతో అయితే ఇక అస్సలు సంబంధమే ఉండదు. ఒక్కసారి ప్రేమలో పడితే ఆస్తులు, అంతస్తులు కూడా ఏవి గుర్తుకురావు. ప్రేమ కోసం కోట్లు విలువ చేసే ఆస్తులను సైతం వదిలేసుకున్నట్టు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అదేవిధంగా బ్రిటన్ రాజకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనల గురించి విన్నాం. టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ మల్లీశ్వరిలో కూడా హీరోయిన్ ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప నిజజీవితంలో చాలా రేర్ అనే చెప్పాలి. అయితే ఓ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయి కోసం కోట్ల ఆస్తిని వదిలేసుకుంది. ఇది జరిగింది భారత్ లో మాత్రం కాదండోయ్.

Advertisement

మలేషియాకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఖుకేపెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛాయా దంపతుల కుమార్తె ఏంజలిన్ కి జెడిడియా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇక ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు తెలిపింది. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒకవేళ నువ్వు అతడిని పెళ్లి చేసుకుంటే మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వమని చెప్పారు తల్లిదండ్రులు. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు.

Advertisement

నేను ప్రేమించిన జెడిడియాతోనే నా జీవితం అంటూ ఏంజెల్ సుమారు రూ.2,484 కోట్ల విలువైన ఆస్తిని సైతం వదులుకొని ప్రియుడి వద్దకు వెళ్లి 2008లో పెళ్లి చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రతీ ఒక్కరూ ఏంజెల్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  ప్రేమించి మోసం చేసే ఈ రోజుల్లో ప్రియుడి కోసం అంతటి ఆస్తిని వదులుకోవడం అసలు మామూలు విషయం కాదంటూ వారిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రియుడితో పెళ్లి కోసం రూ.2వేలకు పైగా ఆస్తిని వదులేసుకున్న ఏంజెలినా ఫ్రాన్సిస్ ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

జెండా ఎగురవేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

మహేష్ బాబు సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ కమెడీయన్ గా నటించాడనే విషయం మీకు తెలుసా ?

అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?

Visitors Are Also Reading