Home » ప్రతి అమ్మాయికి ఈ 4 క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి.. ఇందులో నాలుగవది ఇంపార్టెంట్..!!

ప్రతి అమ్మాయికి ఈ 4 క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి.. ఇందులో నాలుగవది ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం టీనేజ్లో ఎలాంటి విషయాలు ఇష్టపడతామో ఎలా ఉండాలో డిసైడ్ అవుతాము.అవి మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తాయి. అవి మనకు మంచి అలవాటు అయితే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. మీ అలవాట్లు మీ ఆలోచనపై ఎఫెక్ట్ చూపిస్తూ వుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు టీనేజ్లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం.. ముఖ్యంగా కొంతమంది స్టార్ నటీనటులు, లేదంటే పెద్దపెద్ద రంగాల్లో రాణిస్తున్న మహిళలు వారి అలవాట్లు కానీ , ఫిట్నెస్ విషయంలో కానీ, అందంలో కానీ చాలా క్లారిటీ గా ఉంటారు కాబట్టి వారు అందరి కంటే పై స్థాయిలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు.
1.ఇతరులతో పోల్చుకోవడం:
మన బంధువులు కానీ లేదంటే స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా కానీ వారితో మనల్ని కంపేర్ చేస్తే మనం వారిని చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి కానీ డిసప్పాయింట్ చేసేలా ఉంటే ఉండకూడదు.

2.మీపై మీకు నమ్మకం :
ధైర్యం అనేది కండరం లాంటిది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే పెరుగుతుంది. మీరు ప్రతి రోజూ ఎక్సర్సైజ్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీమీద మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు ఒక 30 రోజులు ఎక్ససైజ్ చేయండి. మీలో వచ్చిన కాన్ఫిడెన్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. మనం చూసినట్లయితే ప్రతి ఫేమస్ సెలబ్రిటీ ఎక్ససైజ్ లేదా మెడిటేషన్ లాంటివి తప్పకుండా చేస్తూ ఉంటారు. అందుకే నార్మల్ పీపుల్స్ కంటే వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Advertisement

3.మీకు మీరు నచ్చేలా మారడం :
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి గురించి వారు ఆలోచించడం మర్చిపోయారు. ఫ్యూచర్ కెరియర్లో మీరు ఎలా ఉండాలి అన్న విషయం పైన కాస్త ఆలోచించండి. మీరు ఎవరితో అయితే కంఫర్ట్ గా ఉంటారో వారితోనే టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని ఇరిటేట్ చేసేవారికి మీరు దూరంగా ఉండండి.

4.కుటుంబ సభ్యులకు గౌరవం :
మీ కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వండి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కాబట్టి. ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ లో మీకు బాగా నచ్చిన వ్యక్తి తో షేర్ చేసుకోండి. మీ కుటుంబం మీకు గౌరవం ఇచ్చేలా మిమ్మల్ని నమ్మేలా మీరు మారండి. లైఫ్ లో మిమ్మల్ని ఇష్టపడే ఫ్రెండ్స్ ను కానీ మీరు ఇష్టపడే ఫ్రెండ్స్ ను కానీ అస్సలు వదలకండి.

ALSO READ:

 

Visitors Are Also Reading