Home » పేషెంట్ తో ప్రేమలో పడ్డ డాక్టర్.. మరణించిన తరువాత కూడా ప్రేమతో..!

పేషెంట్ తో ప్రేమలో పడ్డ డాక్టర్.. మరణించిన తరువాత కూడా ప్రేమతో..!

by Anji
Ad

సాధారణంగా ప్రేమ అనేది  ఓ మధరమైన జ్ఞాపకమనే చెప్పవచ్చు. ప్రేమకథలు చాలా విన్నాం. ఇంకా వింటూనే ఉంటాం. ప్రేమ గురించి ఎన్నికథలు వచ్చినా వినసొంపుగానే ఉంటాయి. వాటిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఓ విచిత్రమైన ప్రేమకథ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

Also Read :  హెలికాప్టర్ ప్రమాదానికి ముందు “సౌందర్య” మాట్లాడిన చివరి మాటలు అవేనా ? ఆ రోజు ఏమైందంటే ?

Advertisement

అదేంటంటే.. మరణించిన మహిళ మృతదేహాన్ని వెలికితీసిన ఓ వైద్యుడు దాదాపు ఏడేళ్ల పాటు ఆమెతో కలిసి ఉన్నాడు. ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ అమెరికాలో చోటు చేసుకుంది. మరణించిన తరువాత ఆ యువతి తన ప్రియురాలు కావడంతో అతడు ఇంతకాలం డెడ్ బాడీతోనే ఉండటానికి కారణం చెప్పాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కార్ల్ టాంజ్లర్ అనే వైద్యుడు తనకు చికిత్స చేస్తుండా మరణించిన ఓ మహిళ సమాధిని తెరిచి ఆమెతో ఏడేళ్ల వరకు జీవించాడు. మరియా ఎలెబా మిలాగ్రోడి హోయస్ అనే యువతి మృతదేహంతోనే కలిసి జీవించాడు. 

Advertisement

Also Read : “భైరవద్వీపం” లో బాలయ్య “కురూపి” వేషధారణకి చూపించిన డెడికేషన్ చూస్తే దణ్ణం పెట్టాల్సిందే..!

ఆ యువతి ఆత్మ ఎప్పుడూ తనను చూడడానికి వస్తుందని.. తిరిగి తనకు ప్రాణం పోసుకోవాలనుకునే ఆశతో ఆ యువతి తన కలల్లోకి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అందుకే ఆ మహిళ యొక్క మృతదేహాన్ని బయటికి తీసి ఆమె వద్దే ఉన్నాడు. ఏడేళ్ల వరకు మృతదేహంపై రకరకాల ప్రయోగాలు చేసాడు. మరియా మృతదేహానికి ముసుగు, ఆమె కళ్లకు కూలింగ్ గ్లాసెస్ అమర్చాడు. 21 ఏళ్ల మహిళ క్షయ వ్యాదికి చికిత్స కోసం వచ్చినప్పుడు సదరు వైద్యుడు ఆమెను కలిశాడు. చికిత్స అందించే క్రమంలోనే అతను  యువతితో సన్నిహితంగానే ఉన్నాడు. ఇక తరువాత ఆమెకు వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆ మహిళ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని సమాది చేసిన తరువాత టాంజ్లర్ వారికి తెలియకుండా సమాధిని తెరిచి మృతదేహాన్ని దొంగిలించాడు. ఆ తరువాత ఆ మహిళ మృతదేహంతో ఏడేళ్లు గడిపాడు. సోషల్ మీడియాతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

Also Read :  ప్ర‌తి సినిమాలో క‌నిపించే ముఖేష్ ఎవ‌రు? అత‌ని స్టోరీ ఏంటి?

Visitors Are Also Reading