Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » పోసాని కృష్ణ మురళీ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే ?

పోసాని కృష్ణ మురళీ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే ?

by Anji
Ads

సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు. తాజాగా పోసాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అణుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో జనసేన రాజమహేంద్రవరి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇందిరా రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 

Advertisement

Ad

గత కొద్ది కాలంగా స్థానిక రెండో జేఎఫ్సీఎం కోర్టులో యందం ఇందిరా తరుపున న్యాయవాది ఏవీఎంఎస్ రామచంద్రారావు వాదనలు వినిపించారు. చివరికీ పోసాని పై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం.. పోసానిపై ఐపీసీ 355, 500, 504, 506,507, 509 సెక్షన్ల కింద  రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే పోసాని కృష్ణ మురళీకి ఏపీ సీఎం శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇంతలోనే కేసు నమోదు కావడం గమనార్హం. 

Advertisement

Also Read :  ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా..తెలుగు స్టార్ హీరో తల్లి..!!

Visitors Are Also Reading