Telugu News » Blog » పక్కా ప్రణాళికతోనే యువతిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు.. చివరికీ ఏం జరిగిందంటే ? 

పక్కా ప్రణాళికతోనే యువతిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు.. చివరికీ ఏం జరిగిందంటే ? 

by Anji
Ads

సాధారణంగా ప్రేమించిన యువతిని తన ప్రేమికుడితో కాదని తల్లిదండ్రులు తమకు నచ్చిన వారితో పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుంటారు. తీరా పెళ్లి పీటల వరకు వచ్చే సరికి ప్రియుడు రియాక్ట్ అవుతుంటాడు. ప్రేమించిన యువతిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్లడం వంటివి సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ తాజాగా సినిమా సీన్ ని తలపించేలా హైదరాబాద్ నగర శివారులోని మన్నెగూడలో ఓ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రేమికుడు హీరో మాదిరిగా రాలేదు. అచ్చం విలన్ లా వచ్చాడు. కొంత మంది బృందంతో వచ్చి యువతి కుటుంబ సభ్యులను చితకబాది యువతిని తీసుకెళ్లాడు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు కొంత మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రధాన నిందితుడు  మిస్టర్ టీ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డి. బీడీఎస్ విద్యార్థినిని  తన భార్యగా చూపించేందుకు పన్నిన ప్రణాళికలు ఒక్కొక్కటి బయటపడ్డాయి.   యువతికి నచ్చిన రంగు కారును కొని, బ్యాంకు రుణంలో యువతి పేరు చేర్చినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు యువతి, ఆమె తండ్రి దామోదర్ రెడ్డి, బంధువుల పేరు మిస్టర్ టీ షాపులను కొన్నింటిని రిజస్టర్ కూడా చేయించాడట. మిస్టర్ టీ షాపుల రిజస్టర్ ఆధారంగా యువతిని తన భార్యగా నమ్మించి దామోదర్ రెడ్డి కుటుంబానికి కోర్టు ద్వారా నోటీసులు పంపినట్టు సమాచారం. ఇదే విషయంపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 30, 2022న వైశాలి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు యువతి కుటుంబ సభ్యులతో కలిసి  నవీన్ గోవా, అరకు, విశాఖపట్టణం ప్రాంతాలకు విహార యాత్రలకు కూడా వెళ్లారట. తాజాగా వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందనే విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి దానిని భగ్నం చేేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. 

Advertisement

 

ఎల్బీనగర్  పరిధిలోని హస్తినాపురంలో మిస్టర్ టీ ప్రధాన కార్యాలయంలో మద్యం పార్టీ ఉందని తన టీ బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకున్న యువకులు, అందులో పని చేసే వారికి, స్నేహితులను రప్పించాడు. అక్కడ యువతి ఇంటికి చేరుకున్న తరువాత ఏం చేయాలి ? ఎవరైనా ఎదురు తిరిగితే ఎలా అడ్డుకోవాలి ? ఎలా దాడి చేయాలి ? సీసీ పుటేజీలను ఎలా ధ్వంసం చేయాలి ? అనే వివరాలను వివరించాడు. తాను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమెకు నిశ్చితార్థం చేస్తుండడంతో తట్టుకోలేక ఆగ్రహంతో రగిలిపోయి యువతిని తీసుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గుడిలో బీడీఎస్ విద్యార్థిని, తాను పెళ్లి చేసుకున్నామని రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్ రెడ్డి కేసు వేశారు.  

Advertisement

Also Read :   అక్కినేని కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతోందా.. అందుకే విడాకులు అంటూ?

Manam News

నవీన్ రెడ్డి ఆ యువతిని తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా ఆమెను నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి వద్ద వదిలేసినట్టు సమాచారం. స్థానికుల సాయంతో ఆమె తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్టు సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా కారులో తనను తీసుకెళ్లే సమయంలో తనతో అమానుషంగా ప్రవర్తించారని.. గోళ్లతో రక్కారని, ముఖంపై కొట్టారని వైద్య విద్యార్థిని వెల్లడించింది. దాదాపు 10 మంది కలిసి దాడి చేశారని పేర్కొంది. మాట్లాడితే తన తండ్రిని చంపేస్తామని భయపెట్టారు అని, సాయం కోసం కేకలు వేస్తే కుడి చేతి వేలు విరిచారని.. ఇష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తే.. “నువ్వు నాకిష్టం. అందుకే తీసుకొచ్చాను. ఇంకొకరినీ ఎలా పెళ్లి చేసుకుంటావ్” అని నవీన్ రెడ్డి పేర్కొన్నట్టు వెల్లడించింది. బ్యాడ్మింటన్ శిక్షణకు వెళ్లినప్పుడు సదరు యువతికి నవీన్ రెడ్డి తో పాటు బుచ్చిరెడ్డి పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని.. పెళ్లి సంబంధం చూస్తానని బుచ్చిరెడ్డి చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని నవీన్ తనను సంప్రదించాడు. తాను పెళ్లిని తిరస్కరించడంతో అప్పటి నుంచి వేధింపులు ప్రారంభించాడని పేర్కొంది. గత ఏడాది ఆగస్టు 4న పెళ్లి జరిగిందని నవీన్ చెప్పడం వాస్తవం కాదని వెల్లడించింది. చివరికీ ఆ యువతి ఇంట్లో విధ్వంసానికి పాల్పడిన కేసులో 32 మందిని సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

Also Read :  కృష్ణ వ‌ర్సెస్ రామోజీరావు మ‌ధ్య విభేదాలు ఎందుకు వ‌చ్చాయి..? ఈనాడు అలాంటి ప్ర‌క‌ట‌న ఎందుకు చేసింది..?

You may also like