Home » 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన 69 ఏళ్ల మహిళ..!

960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన 69 ఏళ్ల మహిళ..!

by Anji
Ad

స్వయంగా తాను కారు డ్రైవింగ్ చేయాలనుకుంది. అందుకోసం లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ ఒకటి కాదు.. రెండు కాదు, 10 కాదు, 20 కాదు.. ఏకంగా 960 సార్లు ప్రయత్నించి ఎట్టకేలకు సాధించింది. ఆమె పట్టుదల ముందు అపజయాలు అన్నీ సలామ్ చేశాయి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమి లేదని నిరూపించింది ఓ మహిళ. పట్టుదలతో 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. దక్షిణ కొరియాకి చెందిన ఆ మహిళ తాను ఎన్నిసార్లు విఫలం చెందినప్పటికీ ప్రయత్నిస్తూ.. ఎట్టకేలకు విజయం సాధించింది. 

Also Read :  విరాట్ కోహ్లీ పదోతరగతి మార్కుల మెమో మీరు చూశారా ? ఎన్ని మార్కులు వచ్చాయంటే..?

Advertisement

తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అప్పటికి ఆమె వయస్సు 69 ఏళ్లు.. ఇది జరిగి 18 సంవత్సరాలు గడిచింది. ఓ వ్యక్తి ఆమె పట్టుదల గురించి రెడిట్ లో షేర్ చేయడంతో ఆమె పట్టుదల వైరల్ గా మారింది. దక్షిణ కొరియాకు చెందిన చా సా సూన్ అనే మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తొలిసారిగా 2005లో రాత పరీక్ష రాసి ఫెయిల్ అయింది. ప్రతీసారి పరీక్ష రాస్తూనే ఉంది. మూడేళ్ల పాటు వారానికి 5 రోజులు 780 సార్లు పరీక్షలు రాసింది. ఫెయిల్ అవుతూనే ఉంది. ఒక్కసారి ఓడిపోతేనే నిరాశ ఆవహిస్తుంది. చాసా మాత్రం ఓడిన ప్రతీసారి అంతకు మించిన పట్టుదలతో పరీక్ష రాస్తూనే ఉంది. ఫెయిల్ అవుతూనే ఉంది. ఆమె ప్రయత్నం మాత్రం ఆపలేదు. వారానికి రెండు, మూడు సార్లు రాస్తూనే ఉంది. చివరికీ ప్రాక్టికల్ టెస్ట్ లో పాస్ అయింది. 

Advertisement

Also Read :  ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమంటున్న చిరంజీవి..! 

మొత్తం 960 ప్రయత్నాల తరువాత డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అప్పటికీ ఆమె వయస్సు 69 ఏళ్లు. ఈ ప్రక్రియలో రూ.11వేల ఫౌండ్లు అనగా  భారత కరెన్సీ ప్రకారం..  దాదాపు రూ.11.16లక్షలు ఖర్చు చేసింది. డబ్బు ఎంత ఖర్చు చేసినా తాను డ్రైవింగ్ లైసెన్స్ సాధించాలనే పట్టుదల ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందనే చెప్పాలి. ఆమె పట్టుదలకు సంకల్ప బలానికి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు చా సా సూన్. ఆమె పట్టుదలను ప్రశంసిస్తూ.. దక్షిణ కొరియా కార్ల సంస్థ హ్యుండాయ్ ఓ కారును బహుమతిగా ఇచ్చింది. పరీక్ష రాయడానికి వందల సార్లు వెళ్లడం.. ఫెయిల్ అవ్వడంతో డ్రైవింగ్ స్కూల్ ట్రైనర్ కూడా నిరాశ చెందాడు. ఎట్టకేలకు పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే సరికి డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది ఆమెకు పూలబోకే అందించి ఆనందంగా కౌగిలించుకున్నారు. మాకు పెద్ద బారం తొలగిపోయినట్టుగా అయిందని తెలిపారు.ఆమె పట్టుదల మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అపజయానికి నిరాశ చెందకుండా విజయం సాధించేవరకు కృషి చేయాలని ఆమె  నిరూపించారని కామెంట్ చేశారు. 

Also Read :  ముకేశ్ అంబానికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading