చంద్రబాబు కోసం కంటతడి పెట్టుకున్నారు నారా లోకేష్. ఇవాళ టీడీపీ విస్తృత స్థాయీ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కోసం కంటతడి పెట్టుకున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని… మా ఆస్తులన్నీ బహిర్గతం చేశామన్నారు.డబ్బే సంపాదించాలని చంద్రబాబే భావిస్తే రాజకీయాలు అవసరం లేదని ఫైర్ అయ్యారు. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారని.. అలాంటి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు.
Advertisement
ప్రజల కోసం చంద్రబాబు పని చేశారని… ప్రజలంతా ఆలోచించాలని కోరారు నారా లోకేష్. ఇవాళ చంద్రబాబు కుటుంబానికి ఇబ్బంది రావచ్చని.. రేపు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇదే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సైకో జగన్ ఆలోచలు ఇదే విధంగా ఉంటాయని..టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రం ముక్కలు చేసి అమ్మేసేవాడని ఆగ్రహించారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారు….టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు లోకేష్.
Advertisement
టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదన్నారు. ఇందిరాగాంధీ సీఎంగా ఉన్న ఎన్టీఆరు భర్తరఫ్ చేస్తే మన నేతలు పోరాడారని..కానీ ఆ సంక్షోభం వేరు.. ఈ సంక్షోభం వేరని వివరించారు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జహన్ అనుకున్నారు….భయం అనేదే టీడీపీ బయోడేటాలో లేదని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగనుకు భయపడతామా..? వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించారు నారా లోకేష్.