Home » చంద్రబాబుకు భువనేశ్వరి వల్లే ప్రమాదం.. భోజనం ఆమె పంపిస్తున్నారు -నారాయణ స్వామి

చంద్రబాబుకు భువనేశ్వరి వల్లే ప్రమాదం.. భోజనం ఆమె పంపిస్తున్నారు -నారాయణ స్వామి

by Bunty
Ad

చంద్రబాబు కు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు, ఆయనకు ఏదైనా జరిగితే ఆయన భార్య భువనేశ్వరి పైనే మాకు అనుమానం అంటూ… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఇవాళ మీడియాతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచేనన్నారు. చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు, ఆయనకు ఏదైనా జరిగితే ఆయన భార్య భువనేశ్వరి పైనే మాకు అనుమానం అని వ్యాఖ్యానించారు.

Deputy CM K Narayana Swamy Comments On Nara Bhuvaneswari

సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని.. కోట్ల రూపాయలు చంద్రబాబు లాయర్లకు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహించారు. రోజుకు 25 కోట్లు లాయర్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబుకు ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అవినీతి అంతం చేసే చట్టం 17A అని.. చంద్రబాబుపై సింపతీ ఎక్కడ పెరగలేదన్నారు. కానీ నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Advertisement

Advertisement

Nara Bhuvanaeswari a bout chandrababu Health

Nara Bhuvanaeswari a bout chandrababu Health

సీఎం జగన్ మోహన్ రెడ్డి ను తిట్టిన వారినే నేను తిట్టాను, మా నాయకుడ్ని ఎవరైనా తిడితే ఊరుకోనని హెచ్చరించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎన్టీఆర్ ఫోటో తీసేసి ఓట్లు అడగండి నాలుగు సీట్లు అయినా చంద్రబాబు గెలిస్తాడా అంటూ నిలదీశారు. పుంగనూరు లో పోలీసులపై దాడి చేయించింది చంద్రబాబు అని… పుంగనూరు లో టిడిపి నాయకులు టెర్రరిస్టులు మాదిరే వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఏపీలో మరోసారి జగన్‌ సర్కార్‌ వస్తుందని.. టీడీపీ పార్టీకి ఓటమి తప్పదన్నారు.

 

Visitors Are Also Reading