Home » చాణక్య నీతి: మీ భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పద్దు..!

చాణక్య నీతి: మీ భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పద్దు..!

by Sravya
Ad

చాణక్య చాలా విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ అంతా కూడా సంతోషంగా ఉండొచ్చు. చాణక్య చెప్పినట్లు చేస్తే ఎలాంటి సమస్య రాకుండా మనం జాగ్రత్త వహించవచ్చు. ఆచార్య చాణక్య భార్యకి కొన్ని విషయాలు భర్త చెప్పకూడదని చెప్పారు. భార్యకి భర్తలు ఎలాంటి విషయాలు చెప్పకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో అవమానం, దుఃఖం, బాధ వంటివి కలుగుతాయి. పురుషులు పని చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలన్నీ భార్యకి చెప్పకూడదు.

Advertisement

Advertisement

భార్య బాధపడి మిమ్మల్ని ఓదారుస్తుంది. కానీ ఎప్పుడైనా మీరు ఆమెను దూషిస్తే అవే పదే పదే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను అస్సలు భార్యకి చెప్పడం మంచిది కాదు. భార్యకి మీరు చేసే దానం గురించి మీరు చేసే సహాయం గురించి చెప్పకండి. ఎందుకంటే ఆమె అడ్డుపడవచ్చు. పైగా చేసిన దానం ఎవరికీ చెప్పకూడదు దాని వలన ఫలితం ఉండదు. అదేవిధంగా చాణక్య చెప్పినట్లు మీ బలహీనత గురించి కూడా ఆమెకి చెప్పకండి. ఎప్పుడైనా మీ మిమ్మల్ని బలహీనత గురించి పదేపదే చెబుతూ ఏడిపించవచ్చు కాబట్టి భార్యకి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు చెప్పడం మంచిది కాదు.

Also read:

Visitors Are Also Reading