దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మే 4న ఆయన జన్మదినం సందర్భంగా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ డే ని జరుపుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టుల మధ్య ఉద్యోగుల మధ్య వచ్చే సమస్యలను ఎన్నో పరిష్కరించారు దాసరి నారాయణరావు. తెలుగు సినిమా బిజినెస్ కి కూడా ముఖ్య పాత్ర పోషించారు దాసరి నారాయణరావు. ఆయన అందించిన సేవలకు గాను తెలుగు ఫిలిం అసోసియేషన్ 2018లో ఆయన పుట్టిన రోజుని దర్శకుల రోజుగా మార్చేసారు.
Advertisement
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా దర్శకుడిగా రికార్డని సృష్టించారు. 1974లో దాసరి నారాయణరావు తాతా మనవడు ద్వారా టాలీవుడ్ కి వచ్చారు. ఆ సినిమా తో నంది అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. మొత్తంగా దాసరి నారాయణరావు 150 కి పైగా సినిమాలు చేశారు. ఎంతోమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గొప్ప నటులుగా కూడా మార్చేశారు. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి తీసుకువచ్చి గొప్ప నటులు గా మార్చిన వాళ్ళ జాబితాని చూద్దాం.
మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. నీడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు మహేష్ బాబు. 1979లో ఈ సినిమా వచ్చింది.
మోహన్ బాబు, అన్నపూర్ణ:
Advertisement
స్వర్గం నరకం సినిమాతో మోహన్ బాబు ని అన్నపూర్ణ ని పరిచయం చేశారు దాసరి. ఈ సినిమా తర్వాత హిందీలో కూడా రీమేక్ చేశారు.
ఆర్ నారాయణ మూర్తి:
జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న నారాయణమూర్తికి మంచి పేరుని తీసుకువచ్చారు దాసరి. నీడలో ఆర్.నారాయణమూర్తి నటించేసి అందర్నీ అలరించారు.
శ్రీహరి:
దివంగత నటుడు శ్రీహరి బ్రహ్మనాయుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కృష్ణంరాజు అందులో హీరోగా చేశారు.
దాసరి అరుణ్ కుమార్:
గ్రీకువీరుడు సినిమాలో దాసరి నారాయణరావు రెండవ కొడుకు అరుణ్ కుమార్ నటించారు. ఇలా దాసరి నారాయణరావు చాలామందిని నటులుగా పరిచయం చేశారు.
Also read:
- NTR సిఎంగా ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచమన్న దాసరితో NTR ఏమన్నాడో తెలుసా?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు కలిగిస్తాయి
- త్రివిక్రమ్ చేతికి మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సీక్వెల్..!