ప్రతి ఒక్కరు కూడా, ఇంటిని అందంగా శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఇంట్లో బల్లులు వంటివి ఉంటే చిరాకుగా ఉంటుంది. వాటిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా చేయండి. వెంటనే ఇంటి నుండి బల్లులు వెళ్ళిపోతుంటాయి. బల్లులును తరిమి కొట్టడానికి గుడ్డు పెంకులు బాగా ఉపయోగ పడతాయి. బల్లులకి గుడ్ల వాసన అసలు నచ్చదు ఇంట్లో గుడ్డుని ఉపయోగించినప్పుడు ఆ పెంకులను బయట పారేయకుండా వాటిని ఇంటి తలుపు దగ్గర కిటికీల దగ్గర పెట్టండి. ఇలా చేయడం వలన బల్లులు ఇంట్లో నుండి వెళ్లిపోతాయి.
Advertisement
Advertisement
చల్లగా ఉండే ప్రదేశంలో కూడా బల్లులు ఉండలేవు గది ఉష్ణోగ్రత 22 డిగ్రీల కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఘాటైన వాసనని కూడా బల్లులు తట్టుకోలేవు. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాసన ఉంటే బల్లులు వెళ్లిపోతాయి. మీరు ఉల్లిపాయ రసాన్ని కానీ వెల్లుల్లి రసాన్ని కానీ గోడలపై స్ప్రే చేయండి. అప్పుడు బల్లులు వెళ్లిపోతాయి. నల్ల మిరియాల పొడి ఎర్ర కారం నీటిలో కలిపి బల్లులు ఎక్కువగా కనపడే చోట స్ప్రే చేస్తే కూడా బల్లులు పారిపోతాయి. దోమల కోసం పడే స్ప్రేలు కూడా బల్లులుని తరిమి కొట్టడానికి వాడొచ్చు.
Also read:
- ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి.. ఇక లక్ష్మీ దేవి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది
- ధనియాలను నానబెట్టిన నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!