వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఆడెందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ కు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆడనున్న వార్మప్ మ్యచులు అలాగే కొన్ని ప్రధాన మ్యాచులకు హైదరాబాద్ వేదిక కానున్న తరుణంలో బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ టీం అడుగు పెట్టింది. ఈ తరుణంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాకిస్తాన్ క్రికెటర్లకు స్వాగతం పలికారు. హైదరాబాద్ పోలీసుల ప్రతిష్ట భద్రత నడుమ పార్క్ హయత్ కు చేరుకున్నారు పాకిస్థాన్ ప్లేయర్లు.
దాదాపు 8 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు ఇండియాకు వచ్చిందన చెప్పవచ్చు. అయితే… ఈ తరుణంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ మెడలో ఓ కండువా వేశారు ఎయిర్ పోర్టు నిర్వాహకులు. అయితే..పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ మెడలో వేసిన ఆ కండువా బీజేపీ పార్టీ కలర్ అయిన కాషాయంగా ఉంది. దీంతో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ బీజేపీలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ చేరినట్లు కొంత మంది ట్రోల్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
తెలంగాణ బీజేపీ పార్టీని కాపాడానికి ఏకంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వచ్చాడని.. తెలంగాణలో బీజేపీ అధికారం ఖాయమని ఎద్దేవా చేస్తున్నారు. కాగా టీమ్ బస్ లో తరలివస్తున్న పాకిస్తాన్ క్రికెటర్లను కెమెరాలతో బంధిస్తూ వారికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ తో ఇవాళ తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో ఆడనుంది పాక్ జట్టు.
ఇవి కూడా చదవండి
- అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. నాకు అన్యాయం చేశారని ఫైర్ ?
- Sneha : భర్తకు తెలియకుండా ఆ నిర్మాతతో స్నేహ రిలేషన్ !!
- Anushka : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?