Home » ఉప్పు తినడం వల్ల ఆ అవయవాలకు ఆ అవయమాలకు అంత ప్రమాదామా..?

ఉప్పు తినడం వల్ల ఆ అవయవాలకు ఆ అవయమాలకు అంత ప్రమాదామా..?

by Anji
Ad

సాధారణంగా మనం వండే ఆహారంలో ఉప్పు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  ఏ వంట అయినా  ఎంత మంచిగా చేసినా ఉప్పు లేకుంటే వృధానే అని చెప్పవచ్చు. ఉప్పు మన ఆహారంలో ఒక భాగం. ఉప్పుతోనే మనం వండే ఆహారాలకు అసలైన రుచి వస్తుంది. ఉప్పు లేకపోతే ఏ వంటకమైనా సరే అంత రుచించదు. ఒక రకంగా ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎలా అంటారా.. బాడీలో తగినంత నీరు ఉండేలా చేస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగు పరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుతల్యం చేయడంలో కూడా ఉప్పు మనకు హెల్ప్ అవుతుంది. ఉప్పుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే మాత్రం విషం అవుతుంది.

Advertisement

ఉప్పు అనేది స్లో పాయిజన్. మెల్లగా మన శరీరంలోని అవయవాలను పాడు చేస్తుంది. కాబట్టి ఉప్పును ఎప్పుడూ తక్కువగానే తీసుకుంటూ ఉండాలి. లేదంటే మనం వివిధ దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కోనవలసి ఉంటుంది. ఉప్పును అధికంగా తీసుకోవడం కారణంగా మన శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పని చేయవు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

రక్తనాళాలు :

Advertisement

అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో రక్త నాళాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ కారణంగా రక్త పోటు వచ్చే కారణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా గుండె జబ్బులు కూడా వస్తాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మూత్ర పిండాలు :

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఉప్పు అధికంగా తినడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

మెదడు :

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది.

కంటి సమస్యలు :

ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది. దృష్టి లోపాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎముకలు :

ఉప్పును తీసుకోవడం వల్ల కాల్షియం సాంద్రత అనేది తగ్గుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఎముకలు కూడా బలహీనంగా, నిర్జీవంగా తయారవుతాయి. దీంతో ఎముకలు గుల్లగా తయారవుతాయి. ఉప్పు తింటే రుచిగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అసలైన సమస్యలు మొదలవుతాయి. ఇవి కాస్త దీర్ఘకాలిక వ్యాధులుగా తయారవుతాయి. కాబట్టి ఉప్పును సరైన తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఉత్తమం.

Visitors Are Also Reading