Home » Naga Chaitanya: రెండో పెళ్ళికి సిద్దమైన నాగ చైతన్య.. వధువు ఎవరంటే..?

Naga Chaitanya: రెండో పెళ్ళికి సిద్దమైన నాగ చైతన్య.. వధువు ఎవరంటే..?

by Bunty
Ad

Naga Chaitanya :  అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత, నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితమే వారు ఇద్దరు అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటి నుంచి మరో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ అందులో వాస్తవం లేదని కొట్టి పారేశారు.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారని నాగార్జున అమ్మాయిని కూడా ఫిక్స్ చేశాడని… సినిమా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో చైతన్య వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక నాగచైతన్య… సమంతతో విడాకుల అనంతరం శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ, వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

దీనిపై నాగచైతన్య స్పందించకపోయినప్పటికీ శోభిత మాత్రం ఆ వార్తలను కొట్టి పారేసింది. ఇక శోభితను కాకుండా చైతు వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading