చాలా మంది మనీ ప్లాంట్ ని పెంచుతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటారు. అలానే డబ్బు కూడా బాగా వస్తుందని అనుకుంటారు. ప్రస్తుత ఇండోర్ మొక్కల్లో ఇది కూడా ఒకటి. మనీ ప్లాంట్ ని చాలా మంది ఇళ్లల్లో ఆఫీసులో కూడా పెంచుతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే గాలిని శుద్ధి చేస్తుంది. మనీ ప్లాంట్ విషాన్ని గాలి నుండి తొలగించడానికి కూడా సహాయం చేస్తుంది. మనీ ప్లాంట్ గాలి యొక్క నాణ్యతని మెరుగుపరుస్తుంది.
Advertisement
Advertisement
మనీ ప్లాంట్ ని పెరుగుదల, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చాలామంది మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ప్రశాంతంగా వాళ్ళు ఉండొచ్చని కూడా అంటూ ఉంటారు. వాస్తు ప్రకారం చూసుకుంటే, మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన సంపద పెరుగుతుంది. అలానే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుంది. మనీ ప్లాంట్ డబ్బుని బాగా ఆకర్షిస్తుంది. శ్రేయస్సు ని పెంచుతుంది. ఇంట్లో లేదంటే ఆఫీస్ లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు బాగా వస్తాయట. మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకండి. తక్కువ నీళ్లు సరిపోతాయి.
Also read:
- నిమ్మ తొక్కలని పారేస్తున్నారా..? ఎన్ని లాభాలో చూస్తే.. అలా చెయ్యరు..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో తప్పక జాగ్రత్తలు పాటించండి
- ఒకప్పటి విలన్ దేవరాజ్ భార్య స్టార్ నటి అనే విషయం మీకు తెలుసా ?